• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0

CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0

CJP 48 Hour Ultimatum To CEC Gyanesh Kumar Resignation: నీట్‌ పరీక్ష రద్దుపై మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్‌ జనతా పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మరొకరి రాజీనామా కోరుతూ మరో భారీ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. జంతర్‌ మంతర్‌ 2.0 తప్పదని సీజీపీ హెచ్చరించింది.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 24, 2026, 05:09 PM IST|Updated: Sep 24, 2026, 05:15 PM IST
joinshare
CEC Resignation: కాక్రోచ్‌ పార్టీ మరో సంచలన నిర్ణయం.. ఆయన రాజీనామా చేయకపోతే జంతర్‌ మంతర్‌ 2.0
Image Credit: Cockroach Janta Party Twitter

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CEC Gyanesh Kumar Resignation: ఎన్నికల సంఘంపై తీవ్ర వివాదం రాజుకుంటున్న వేళ రాజకీయ పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఇదే డిమాండ్‌పై కాక్రోచ్‌ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. సీఈసీ పదవికి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు 48 గంటల సమయం ఇచ్చింది. ఆలోపు ఆయన రాజీనామా చేయకపోతే మరో జంతర్‌ మంతర్‌ ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు బొద్దింకల జనతా పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే కీలక ప్రకటన చేశారు. 'జ్ఞానేశ్‌ కుమార్ ఈ దేశంలోనే అతిపెద్ద దేశద్రోహి. ఆయన భారతదేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు. వెంటనే ఆయన సీఈసీ పదవికి రాజీనామా చేయాలి' అని అభిజీత్‌ డిమాండ్‌ చేశారు.

భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓ ప్రధాన ఆంగ్ల పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై స్పందిస్తూ.. న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా మళ్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపడతామంటూ తెలిపారు. భారత ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాల నేపథ్యంలో కాక్రోచ్‌ జనతా పార్టీ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతోపాటు త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికలను నిలిపివేయాలి.. సర్‌ ప్రక్రియను ఆపివేయాలి.. ఓటర్ల జాబితాలను జనవరి 2025 నాటి జాబితాకు తిరిగి మార్చాలి' అని కాక్రోచ్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

'సర్‌’కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను పరిశీలించేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కాక్రోచ్‌ పార్టీ అధినేత అభిజీత్‌ దీప్కే డిమాండ్ చేశారు. యువత తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశం కోసం రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అని.. కానీ జ్ఞానేశ్‌ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినప్పటి నుంచి ఎవరు ఓటు వేయాలి? ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోందని అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. ఇదేనా ప్రజాస్వామ్యం?’’ అని కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రశ్నించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News