Allu Arjun Lokesh Movie Cancelled: అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై టీం సైలెంట్‌గా ఉండటం, లోకేష్ హీరోగా కథలు వింటుండటంతో నిజమే అనే టాక్ కూడా ఆ మధ్య నడిచింది. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ ఫుల్ క్లారిటీ ఇస్తూ.. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆన్‌టైమ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసారు.
కథతో మెప్పించలేకపోయిన లోకేష్ కనగరాజ్..
లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ సినిమా విషయంలో తెరవెనక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా గట్టిగా వినిపిస్తోంది, అదేంటంటే లోకేష్ చెప్పిన కథ బన్నీకి పూర్తిగా కనెక్ట్ కాలేదనేది మరో అభిప్రాయం. అందుకే ఈ స్క్రిప్ట్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు, కొత్త వెర్షన్ రెడీ చేయడానికి లోకేష్ దాదాపు మూడు నెలల టైమ్ అడిగినట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి.. బన్నీని పూర్తి స్థాయిలో మెప్పించేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అట్లీ మూవీ తర్వాత లోకేష్ మూవీ..
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాను పూర్తి చేసే పనిలో ఐకాన్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు. అది కూడా పూర్తిగా అల్లు అర్జున్ కథపై శాటిస్ఫై అయితేనే. ఈ లోపు మరో దర్శకుడితో అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళతాడా అనేది చూడాలి మరి. ఇక లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే సినిమాకు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే AA23కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా రాకాపైనే ఉంది.