SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

DA Vs DR: డీఏ, డీఆర్ మధ్య అసలు తేడా ఇదే.. కొత్త పే కమిషన్ వస్తే లెక్కలు ఎలా మారతాయి..?

DA vs DR Difference: ప్రస్తుతం 8వ వేతన సంఘంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న వేళ.. అసలు DA అంటే ఏమిటి..? DR అంటే ఏమిటి..? వీటిని ఎలా లెక్కిస్తారు..? కొత్త వేతన సంఘం వస్తే వీటి లెక్కల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి..? వంటి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 20, 2026, 07:34 PM IST | Updated: Oct 20, 2026, 07:37 PM IST
Image Credit: DA vs DR Difference (Source: File)
Join

DA vs DR Difference: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన కీలక అంశాల్లో కరువు భత్యం (DA), కరువు ఉపశమనం (DR) ముఖ్యమైనవి.. త్వరలో కొత్త పే కమిషన్ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో డీఏ, డీఆర్ పెంపు ఎంత ఉంటుందనే విషయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డీఏ, డీఆర్ మధ్య తేడాలు ఇక్కడ తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలపై డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) అందుకుంటారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పెన్షన్లపై డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పొందుతారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతుంది. ఆ ద్రవ్యోల్బణ సెగ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల జీవనంపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ DA, DR ఏడాదికి రెండుసార్లు అందిస్తుంది.

డీఏ లెక్కింపు విధానం ఇలా..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా DA శాతాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.30 వేలు అనుకుంటే.. ప్రస్తుత డీఏ రేటు 60 శాతం ప్రకారం లెక్కిస్తే.. ఆ ఉద్యోగికి నెలకు రూ.18 వేలు డీఏ రూపంలో అందుతుంది. అంటే బేసిక్ పే, డీఏ కలిపి మొత్తం జీతం రూ.48 వేలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) డీఏ శాతాన్ని సవరిస్తుంది.

డీఆర్‌ను ఎలా లెక్కిస్తారంటే..

డీఆర్ అంటే పదవీ విరమణ చేసిన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే కరువు ఉపశమనం. సర్వీసులో లేకపోయినా.. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు పెన్షనర్లపై భారం పడకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. పెన్షనర్ తీసుకునే బేసిక్ పెన్షన్‌పై ఈ డీఆర్ శాతాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక విశ్రాంత ఉద్యోగి బేసిక్ పెన్షన్ రూ.20 వేలు అనుకుంటే.. DR 60 శాతం ఉందనుకుంటే.. అతనికి ప్రతినెలా రూ.12 వేలు డీఆర్ అందుతుంది. దీంతో బేసిక్ పెన్షన్, డీఆర్ కలిపి మొత్తం రూ.32 వేలు పెన్షన్ చేతికి వస్తుంది. డీఏ మాదిరిగానే డీఆర్ కూడా ఏడాదికి రెండుసార్లు పెరుగుతుంది.

కొత్త పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వస్తే.. DA, DR శాతాలను బేసిక్ వేతనం లేదా బేసిక్ పెన్షన్‌లో విలీనం చేసే అవకాశం ఉంది. పాత భత్యాలను కొత్త బేసిక్ పేలో కలిపిన తర్వాత.. డీఏ, డీఆర్ కౌంటర్ సున్నా శాతం వద్దకు రీసెట్ అవుతుంది. ఆ తర్వాత కొత్త బేసిక్ ఆధారంగా భవిష్యత్ ద్రవ్యోల్బణాన్ని బట్టి మళ్లీ పెంపుదలను లెక్కిస్తారు. అయితే 8వ వేతన సంఘం నివేదిక సమర్పించిన తర్వాతే తుది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, డీఏ విలీనం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES