Son of Kanakadurgamma First Look: యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ కనకదుర్గమ్మ. దుర్గ ఫణిదర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాగ మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. కాకర్ల గోవర్దనరావు కథను అందించారు. దసరా సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్ పోస్టర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పోస్టర్ విషయానికి వస్తే.. నటి లయ అమ్మవారి అవతారంలో ఎంతో ఉగ్రరూపంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ పాయింటతో 'నిధి అన్వేషణ' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. స్క్రీన్‌పై లయ కనిపించే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని.. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పారు.
ఈ సినిమాకు శశిధర్ లంక మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ కే ప్రసన్ అందించారు. ప్రసాద్ కేవీ కెమెరామెన్‌గా వర్క్ చేస్తుండగా.. రాజేష్ లంక యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఎడిటింగ్ బాధ్యతలు రాఘవేందర్ రెడ్డి నిర్వర్తిస్తుండగా.. చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ డైలాగ్స్ రాశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, ప్రమోషనల్ అప్‌డేట్లను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
నటీనటులు: అనురూప్ కటారి, లయ, ఆకాంక్ష త్యాగరాజన్ తదితరులు
బ్యానర్లు: రాగా మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్: వాణి శంకర్, తిలోత్తమ
డైరెక్షన్: దుర్గ ఫణిదర్ లంక
కథ: కాకర్ల గోవర్దనరావు
మ్యూజిక్: శశిధర్ లంక
నేపథ్య సంగీతం: శ్యాం కే ప్రసన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ కేవీ
ఎడిటర్: రాఘవేందర్ రెడ్డి
డైలాగ్స్: చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ
ఫైట్స్: రాజేష్ లంక
PRO: సాయి సతీష్