SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గుడ్డును అమాంతం మింగేసిన పాము.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

Snake Swallows Egg Video: ఓ అత్యంత ప్రమాదకరమైన పామును పక్షి గుడ్లను మింగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారలు ఆశ్చర్యపోయి.. కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 04:54 PM IST | Updated: Oct 26, 2026, 04:55 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Snake Swallows Egg Video: అత్యంత విషపూరితమైన పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పడూ విపరీతంగా ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పాములు ఆహారాన్ని వేటాడే విధానం, శరీర పరిమాణాన్ని మించి ఆహారాన్ని మింగే ఘటనలను చూసి అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వినియోగదారులు షాక్ అవుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. తన తల పరిమాణం కంటే ఎంతో పెద్దదిగా ఉన్న ఒక పక్షి గుడ్డును ఓ ప్రమాదకరమైన పాము అమాంతం మింగేసిన దృశ్యాలు మీరు చూడోచ్చు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ విషపూరితమైన పాము ఆహారం కోసం వెతుకుతూ.. ఒక పక్షి గుడ్లు పెట్టిన చోటికి వెళ్లడం మీరు గమనించవచ్చు.. అలాగే మీకు గోధుమ రంగులో ఉన్న పెద్ద పరిమాణపు గుడ్డు కూడా కనిపిస్తాయి.. సాధారణంగా పాముల తల పరిమాణం చాలా చిన్నదిగా ఉండడం మనం తరుచుగా చూస్తూ ఉంటాము.. కానీ అక్కడ ఉన్న పక్షి గుడ్డు మాత్రం ఆ పాము నోటి సైజు కంటే ఎంతో పెద్దదిగా ఉండడం మీరు క్లియర్‌గా చూడోచ్చు. మొదట ఆ గుడ్డును చూసిన ఆ పాము.. ఏమాత్రం తొందరపడకుండా అత్యంత నెమ్మదిగా దాని దగ్గరకు కూడా వెల్లడం మీరు చూడోచ్చు. అనంతరం తన పైదవడ.. కిందిదవడలను వీలైనంత వెడల్పుగా తెరిచి.. గుడ్డును మెల్లమెల్లగా నోట్లోకి లాక్కోవడం మొదలు పెట్టేసింది..

పాములకు ఉండే శారీరక నిర్మాణం ప్రకారం.. వాటి కింది దవడ ఎముకలు ఒకదానికొకటి గట్టిగా అతుక్కుని ఉండలేకుండా ఉంటాయి.. సాగే గుణం కలిగిన ప్రత్యేక లెగ్మెంట్‌ సాయంతో అవి.. తమ నోటిని సాధారణ పరిమాణం కంటే.. అనేక రెట్లు పెద్దదిగా తెరుచుకుంటూ ఉంటాయి.. ఈ వీడియోలోనూ సరిగ్గా అదే అద్భుతం కనిపించడం మీరు చూడోచ్చు.. ఆ పాము కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎంతో ఓపికగా ఆ పెద్ద గోధుమ రంగు గుడ్డును గొంతులోకి దించేయడం కూడా మీరు చూడోచ్చు.. ఆ గుడ్డు గొంతు గుండా కడుపులోకి జారుతున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియో చూసిన సోషల్‌ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. ప్రకృతిలో పాముల ఆహారపు అలవాట్లు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని అని చాలా మంది కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది మాత్రం.. అంత పెద్ద గుడ్డును మింగడం పాములకే సాధ్యం.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES