Visakhapatnam Bengaluru Special Train: సౌత్ కోస్ట్ రైల్వే, ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరుకు వెళ్లే ప్రత్యేక దసరా-దీపావళి రైలును ప్రకటించింది. పండుగ సందర్భంగా మీరు కూడా మీ ఊర్లకు వెళ్లాలనుకుంటే, ఈ రైళ్లు ఎంతో ఉపశమనాన్ని అందిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భారతీయ రైల్వే ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో, విశాఖపట్నం నుండి ఎస్ఎంవీబీ బెంగళూరుకు కూడా పూజ స్పెషల్ రైలును ప్రకటించింది. ట్రైన్ నంబర్లు 08583/ 08584 గా ఉన్న ఈ రైళ్లు అక్టోబర్ 6 నుండి నవంబర్ 25 వరకు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైలు LHB ఎక్విప్‌మెంట్‌తో నడుస్తుంది, ఇందులో సీటింగ్ ఏర్పాట్లుగా స్లీపర్, 3ఏసీ టైర్, 2సెకండ్ ఏసీ, జనరల్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.
ట్రైన్ నంబర్ 08583 విశాఖపట్నం నుండి ఎస్ఎంవీబీ బెంగళూరుకు అక్టోబర్ 6 నుండి నవంబర్ 24 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. ఇక ట్రైన్ నంబర్ 08584 ఎస్ఎంబిబి బెంగళూరు నుండి విశాఖపట్నంకు అక్టోబర్ 7 నుండి అందుబాటులోకి వస్తుంది. ఇది ప్రతి బుధవారం సాయంత్రం 3:50 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది. మొత్తం ఎనిమిది ప్రయాణాలు ఉంటాయి.
ఈ రైలులో మొత్తం 19 LHB కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఏసీ 2 టైర్ -2 కోచ్‌లు, ఏసీ 3 టైర్-4 కోచ్‌లు, స్లీపర్ క్లాస్-7 కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్-4 కోచ్‌లు, బ్రేక్ వ్యాన్, జనరేటర్ కార్లు-2 కోచ్‌లుగా డిజైన్ చేశారు.
ట్రైన్ నంబర్ 08583 విశాఖపట్నం నుండి బెంగళూరుకు వెళ్లే రైలు, మంగళవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అదేవిధంగా, రిటర్న్ జర్నీలో 08584 ఎస్ఎంవీబీ బెంగళూరు నుండి విశాఖపట్నంకు వెళ్లే రైలు, సాయంత్రం 3:50 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రూట్‌లో దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడీ, జోలర్పేట, బంగారుపేట, కృష్ణరాజుపేట వంటి ప్రాంతాల గుండా ఈ రైలు వెళ్తుంది. ఇప్పటికే పొదనూరు నుండి బరౌనీకి కూడా ట్రైన్ నంబర్ 06021 అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల గుండా భారతీయ రైల్వే ఈ ప్రత్యేక సర్వీసులను అందిస్తోంది. కొన్ని కొత్త రైళ్లను ప్రకటించగా, మరికొన్ని రైళ్ల సర్వీసులను పొడిగించింది.