తొలి జీతంతో తండ్రి కల నెరవేర్చిన కూతురు.. బుల్లెట్ గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాన్న!
Daughter Gifts Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ కూతురు తన తండ్రికి మొదటి జీతంలో గిప్ట్ ఇచ్చిన ఘటన విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను చేసి పని అందరినీ ఆకట్టుకుంటోంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Daughter Gifts Viral Video: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడుతూ ఉంటారు.. తమ కోరికలను పక్కన పెట్టి.. పిల్లల ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. అయితే, ఆ పిల్లలు ప్రయోజకులై, తమ మొదటి సంపాదనతో తల్లిదండ్రులకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వివరించడం చాలా కష్టం.. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. ఓ కూతురు తన మొదటి జీతంతో తండ్రికి ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో @mndavi_shrma అనే ఖాతా నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.. వీడియోలో ఒక సాధారణ ఇంట్లో.. ఆకుపచ్చ రంగు గోడలు ఉన్న చిన్న గదిలో ఓ తండ్రి మంచం మీద కూర్చుని ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఆయన ఎదురుగా నిలబడిన కూతురు.. తన చేతిలో న్యూస్ పేపర్‌లో చుట్టిన ఒక చిన్న ప్యాకెట్‌ను తండ్రికి ఇవ్వడం మీరు గమనించవచ్చు. అందులో ఏముందో తెలియక ఆ తండ్రి ఎంతో ఆసక్తిగా.. నెమ్మదిగా ఆ పేపర్‌ను విప్పడం కూడా మీరు గమనించవచ్చు..
పేపర్ విప్పగానే అందులో ఒక బైక్ తాళం చెవి కనిపిస్తుంది... దీనిని చూసి ఆ తండ్రి ఎంతగానో ఆశ్చర్యపోవడం మీరు చూడొచ్చు.. ఆ తాళం చెవిని చేతిలోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు.. తన కూతురు తనకోసం కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కొనుగోలు చేసిందని తెలుసుకున్న ఆ తండ్రి ముఖంలో వెలుగు చూసి.. తన కూతురు ఎంతగానో ఆనందంగా ఉండడం మీరు చూడొచ్చు. ఒకవైపు కళ్లలో ఆనందబాష్పాలు, మరోవైపు కూతురిపై అంతులేని ప్రేమ ఆయన నవ్విన తీరు అందరినీ కట్టిపడేసేలా చేసింది.. ఆ తండ్రి తన కొత్త బుల్లెట్ బైక్ పక్కన నిలబడి ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులివ్వడం కూడా ఈ తర్వాత వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..
ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆ యువతి రాసిన మాటలు అందరినీ కదిలిస్తూ వస్తున్నాయి.. నాకు అన్నీ చేసి ఆయన తన జీవితాన్ని ధారబోశారు.. ఈరోజు నా సొంత సంపాదనతో ఆయనకు ఒక చిన్న కానుక ఇచ్చే అవకాశం నాకు దక్కింది.. అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ వస్తున్నారు. ఒక తండ్రికి తన కూతురు ఇచ్చే మంచి గౌరవం ఇదే.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఈ వీడియో చూస్తుంటే నా కళ్లకు నీళ్లు వస్తున్నాయి.. నేను కూడా నా నాన్నకు ఇలాగే సర్‌ప్రైజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అని మరొకరు రాసుకొచ్చారు.. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.