SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Delivery boy turned hero in moholi: మహిళ డెలివరీ తీసుకుంటుంది. ఇంతలో ఆమె కిచెన్ నుంచి పొగలు రావడంతో అక్కడకు వెళ్లి చూసింది. వంటగదిలో గ్యాస్ మీద పెట్టిన పాన్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె కేకలు పెట్టింది.

Written By Inamdar Paresh
Published: Oct 20, 2026, 05:07 PM IST | Updated: Oct 20, 2026, 05:18 PM IST
Image Credit: delivery boy in mohali news
Join

Delivery person saves doctors house in Mohali: చాలా మంది ఇటీవల తమకు కావాల్సిన అన్ని వస్తువుల కోసం ఆన్ లైన్ డెలీ వరీ యాప్ లపై ఆధార పడుతున్నారు. ప్రతి రోజు మనకు కావాల్సిన వాటిని డెలివరీ ఏజెంట్ లు ఇంటి గుమ్మం వద్ద తీసుకొచ్చి పెడుతున్నారు. కొంత మంది డెలీవరీ బాయ్ లు ఇటీవల పార్శీల్ లను ఇచ్చే క్రమంలో వారి ప్రవర్తన వివాదాస్పదంగా ఉంటుంది. కొంత మంది సింగిల్ గా అమ్మాయిలు కన్పిస్తే వారిని వేధించడం చేస్తున్నారు. 

 

 

మరికొంత మంది పార్శీల్ లను ఓపెన్ చేసి దానిలోని ఐటమ్ లను మాయం చేయడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఒక డెలీ వరీ బాయ్ మాత్రం పార్శీల్ ఇవ్వడానికి వెళ్లి అతను చేసిన పనికి హీరోలా మారాడు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


పంజాబ్ లోని మొహలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.డా. శివాంగి జోషి తన ఇంటికి కావాల్సిన ఐటమ్ లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. ఇంతలో డెలీవరీ ఏజెంట్ ఆమె పార్శీల్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆమె కిచెన్ లో పాన్ పెట్టారు.  ఇంతలో పొగలు రావడంను ఆమె గమనించింది. 

వెంటనే కిచెన్లోకి వెళ్లి చూడగా పాన్ అంతటా మంటల వ్యాపించాయి. దీంతో  ఆమె గట్టిగా కేకలు పెట్టింది. వెంటనే డెలీవరీ బాయ్ ఇంట్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న ఒక టవల్ తో మంటల మీద కప్పాడు. సమయస్పూర్తీతో గ్యాస్ కుఅంటుకున్న మంటలు వ్యాపించకుండా టవల్ తో కప్పేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. 

పెద్ద ప్రమాదం తప్పడంతో సదరు మహిళ ఊపిరిపీల్చుకుంది. తన ఇంటికి, తన ప్రాణాలను కాపాడిన డెలీవరీ బాయ్ కు మహిళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గామారింది. నెటిజన్లు డెలీవరీ బాయ్ ను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES