• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

Delivery boy turned hero in moholi: మహిళ డెలివరీ తీసుకుంటుంది. ఇంతలో ఆమె కిచెన్ నుంచి పొగలు రావడంతో అక్కడకు వెళ్లి చూసింది. వంటగదిలో గ్యాస్ మీద పెట్టిన పాన్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆమె కేకలు పెట్టింది.

Written ByInamdar Paresh
Published: Oct 20, 2026, 05:07 PM IST|Updated: Oct 20, 2026, 05:18 PM IST
joinshare
Mohali Delivery Person:  కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..
Image Credit: delivery boy in mohali news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..  డిసెంబర్ 4 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. అసలు విషయం ఇదే..

Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 4 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. అసలు విషయం ఇదే..

2

Mohali Delivery Person: కిచెన్ లో ఎగిసిపడ్డ మంటలు.. డెలివరీ బాయ్ సమయస్పూర్తీకి నెట్టింట ప్రశంసలు.. వీడియో..

3

Chandrababu: స్థానిక ఎన్నికల్లో 57 శాతం స్ట్రైక్ రేట్ కంటే మెరుగ్గా రావాలి: చంద్రబాబు

4

బడ్జెట్ తలకిందులు.. భగ్గుమంటున్న పప్పులు, నూనెలు, సన్న బియ్యం ధరలు!

5

Himachal Pradesh: దేశ మంతా దసరా తర్వాత.. ఇక్కడ వారంపాటు సంబరాలు.!. హిమాచల్ ప్రదేశ్‌లో వింత సంప్రదాయం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Delivery person saves doctors house in Mohali: చాలా మంది ఇటీవల తమకు కావాల్సిన అన్ని వస్తువుల కోసం ఆన్ లైన్ డెలీ వరీ యాప్ లపై ఆధార పడుతున్నారు. ప్రతి రోజు మనకు కావాల్సిన వాటిని డెలివరీ ఏజెంట్ లు ఇంటి గుమ్మం వద్ద తీసుకొచ్చి పెడుతున్నారు. కొంత మంది డెలీవరీ బాయ్ లు ఇటీవల పార్శీల్ లను ఇచ్చే క్రమంలో వారి ప్రవర్తన వివాదాస్పదంగా ఉంటుంది. కొంత మంది సింగిల్ గా అమ్మాయిలు కన్పిస్తే వారిని వేధించడం చేస్తున్నారు. 

 

CCTV Footate కిచెన్ రూమ్‌లో మంటలు డెలివరీ బాయ్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం డా. శివాంగి జోషి తన ఇంట్లో వంట చేస్తున్నప్పుడు.. ఆర్డర్ తెచ్చిన డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకునే గ్యాప్‌లోనే.. కిచెన్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఇది గుర్తించి డా. శివాంగి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా.. ఫలితం దక్కలేదు భయంతో వెనకడుగు వేసి.. డెలివరీ బాయ్‌ను సహాయం కోసం పిలిచారు అతను ఏమాత్రం భయపడకుండా హీరోలా ముందుకొచ్చి.. మంటలు ఆర్పేశాడు దాంతో తప్పిన పెను ప్రమాదం.. డెలివరీ బాయ్ మీద ప్రశంసల వర్షం

— PulseNewsBreaking (@pulsenewsbreak) October 20, 2026

 

మరికొంత మంది పార్శీల్ లను ఓపెన్ చేసి దానిలోని ఐటమ్ లను మాయం చేయడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఒక డెలీ వరీ బాయ్ మాత్రం పార్శీల్ ఇవ్వడానికి వెళ్లి అతను చేసిన పనికి హీరోలా మారాడు.ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


పంజాబ్ లోని మొహలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.డా. శివాంగి జోషి తన ఇంటికి కావాల్సిన ఐటమ్ లను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. ఇంతలో డెలీవరీ ఏజెంట్ ఆమె పార్శీల్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆమె కిచెన్ లో పాన్ పెట్టారు.  ఇంతలో పొగలు రావడంను ఆమె గమనించింది. 

వెంటనే కిచెన్లోకి వెళ్లి చూడగా పాన్ అంతటా మంటల వ్యాపించాయి. దీంతో  ఆమె గట్టిగా కేకలు పెట్టింది. వెంటనే డెలీవరీ బాయ్ ఇంట్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న ఒక టవల్ తో మంటల మీద కప్పాడు. సమయస్పూర్తీతో గ్యాస్ కుఅంటుకున్న మంటలు వ్యాపించకుండా టవల్ తో కప్పేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. 

పెద్ద ప్రమాదం తప్పడంతో సదరు మహిళ ఊపిరిపీల్చుకుంది. తన ఇంటికి, తన ప్రాణాలను కాపాడిన డెలీవరీ బాయ్ కు మహిళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గామారింది. నెటిజన్లు డెలీవరీ బాయ్ ను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Trending News
Telugu News