పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్! IPPB ప్రాసెస్!
మీరు పెన్షన్‌దారులా? అయితే, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదా? బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ప్రతి ఏడాది పింఛను దారులు ఈ సర్టిఫికేట్ అందిస్తే తదుపరి ఏడాదికి కూడా సదరు పెన్షను దారుడు అర్హుడు అవుతాడు. అయితే, వయస్సు మళ్లినవారికి బ్యాంకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ ఎలా చేయాలి? తెలుసుకుందాం.
Digital Life Certificate 2026: ప్రతి ఏడాది పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా రానున్న ఏడాదికి కూడా వారు పెన్షన్‌కు అర్హులు అవుతారు. అయితే, ప్రతి ఏడాది ఇలా లైఫ్ సర్టిఫికేట్ పింఛనుదారులు సబ్మిట్ చేస్తేనే పెన్షన్ కంటిన్యూ అవుతుంది. అయితే, దీనికి బ్యాంకు వెళ్లి మరీ ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇంట్లో నుంచే సింపుల్‌గా ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. దీనికి బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కొందరు పెద్దవారికి ఆరోగ్యం సహకరించక వారు బ్యాంకు వెళ్లలేని దుస్థితి ఏర్పడుతుంది. అయితే, వీళ్లు కూడా ఇంట్లో నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే సౌలభ్యం ఉంది. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సర్వీస్ అందిస్తోంది. అయితే, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి తెలుసుకుందాం.
IPPB ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే విధానం..
మీరు ఈపీఎఫ్‌ఓ ఈపీఎస్ 95 పింఛనుదారులు అయితే, ఇంట్లో నుంచే ఐపీపీబీ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయవచ్చు.మీ దగ్గరలో ఉన్న లోకల్ పోస్ట్ ఆఫీస్ లేదా గ్రామీణ పోస్టల్ సర్వీస్ ఉద్యోగి మీరు ఇంటికి నేరుగా వచ్చి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి 033-22029000 కాంటాక్ట్ అయి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది.
ఇది కాకున్నా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ సందర్శించినా అక్కడ మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. దీనికి ఆధార్ కార్డు నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, పింఛను ఖాతా వివరాలు కావాలి. ఆధార్ ఆధారిత అథెండికేషన్, బయోమెట్రిక్ ద్వారా పోస్టల్ వారే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. అప్పుడు మీకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్..
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే మీ వద్ద ముందుగా ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. ఆధార్ కార్డు, పీపీఓ నెంబర్, పెన్షన్ ఖాతా నెంబర్, పింఛను రకం.
Read Also: మీ ఆధార్ డేటా సేఫ్‌గా ఉందా? బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎలాగో తెలుసా?
మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ పెన్షన్ సర్టిఫికేట్ పొందే విధానం..
మీ వద్ద స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఇంట్లో నుంచే లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. దీనికి మీరు జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ లేద ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఇది కేవలం అధికారిక సోర్స్ నుంచే డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ పెన్షన్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. అందులో ఉన్న నిబంధనల ఆధారంగా ఫేషియల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. వెంటనే సర్టిఫికేట్ ఐడీ జనరేట్ అవుతుంది. దాన్ని భద్రపరచుకోండి. అయితే, యాప్ ఉపయోగించినప్పుడు మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ పంచుకోకండి.