• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

Diwali 2026: భారతదేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా కొనసాగితే కానీ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ పండగను జరుపుకోరు.. అంతేకాకుండా ఈరోజు రావణుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారట.. అసలు ఏ ప్రాంతాల్లో రావణుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 02:27 PM IST|Updated: Nov 08, 2026, 02:28 PM IST
joinshare
దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
భూమి పొత్తిళ్లలో ఇంకా ఎంత బంగారం మిగిలుంది? ఇప్పటివరకు మనం ఎంత తవ్వి తీశామో తెలుసా?

భూమి పొత్తిళ్లలో ఇంకా ఎంత బంగారం మిగిలుంది? ఇప్పటివరకు మనం ఎంత తవ్వి తీశామో తెలుసా?

2

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.279 లకే నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్‌స్క్రిప్షన్.. 30GB డేటా ఉచితం!

3

సోమవారం బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే.. అసలు కారణం ఇదే!

4

దీపావళి రాత్రి పక్కింట్లో దొంగతనం చేస్తే అదృష్టం వస్తుందట.. హిమాచల్‌లో వింత ఆచారం!

5

దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali 2026: దీపావళి పండగ దేశమంతా ఎంతో ఘనంగా దీపాలతో రంగురంగుల వెలుగులు అందించే బాణా సంచాలతో.. మిఠాయిల పంపిణీ సంబరాలతో జరుపుకుంటుంటే.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. రాముడు రావణుడిని సంహరించి అయోధ్యాకు తిరిగి వచ్చిన శుభసమయంగా మెజారిటీ ప్రజలు దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే, లంకాధిపతి రావణుడిని దుష్ట సంహారానికి ప్రతీకగా కాకుండా.. తమ ఆరాధ్య దైవంగా.. రక్త సంబందికుడిగా.. ఒక చక్రవర్తిగా భావించే కొన్ని తెగలతో పాటు వర్గాల వారు దీపావళి రోజున సంతాపదినం పాటిస్తూ ఉంటారు.. అక్కడ దీపాలు వెలగవు.. అసలు బాణాసంచా చప్పుడులు ఉండవు..

విదిష..
మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లా రావణ్ గ్రామంలో దశకంఠుడి ప్రత్యేకమైన ఆలయం ఉంది ఇక్కడ కన్యాకుబ్జ బ్రాహ్మణ వర్గం వారు రావణుడి ని తమ పూర్వికుడిగా గొప్ప వేద పండితుడిగా భావిస్తూ ఉంటారు దీపావళి రోజున గ్రామస్తులు నల్లటి వస్త్రాలు ధరించి రావణ ప్రతిమకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారట రావణుడి పతనానికి షోకిస్తూ సంతాప సభ జరుపుతారట ఇక్కడ ఏ కార్యం మొదలుపెట్టిన రావణుడి అనుమతి తీసుకుని.. ప్రారంభించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది..

మండోర్..
రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలోని మండోర్ ప్రాంతాన్ని రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారు. స్థానిక మౌద్గిల్, శ్రీమాలి బ్రాహ్మణులు రావణుడిని తమ అల్లుడిగా గౌరవిస్తారు.. భారతీయ సాంప్రదాయంలో అల్లుడి మరణం అత్యంత శోకదాయకం కాబట్టి దీపావళి పండగ రోజున వారు ఎలాంటి వేడుకలు జరుపుకోవాలని నిశ్శబ్దమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారట.. అంతేకాకుండా తమ అల్లుడికి ఈరోజు పిండ ప్రదానాలు.. శ్రద్ధ కర్మలు చేస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తూ ఉంటారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు ఇక్కడ రావణుడికి ప్రత్యేకమైన ఆలయం కూడా నిర్మించారట.. అంతేకాకుండా ఆ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా రోజు జరుగుతాయట..

గడ్చిరోలి..
మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో నివసించే గోండు గిరిజనులకు రావణుడు ఆదివాసీల ఆత్మగౌరవంగా భావిస్తూ ఉంటారట అందుకే దీపావళి పండగ రోజున ఈ తెగకు సంబంధించిన ప్రజలు రావణుడిని తమ గురువుగా భావించి ఆరాధిస్తూ ఉంటారట.. పండగ రోజున రావణ్ మహోత్సవ పేరుతో నివాళులు అర్పిస్తూ తమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం.. ఈ ఆచారాలు కేవలం నమ్మకాలకే పరిమితం కాకుండా భారతీయ సాంస్కృతిలోనూ ఒక భాగంగా మారాయి..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News