SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి, ఛత్ పూజకు రైల్వే బంపర్ గిఫ్ట్.. తెలుగు రాష్ట్రాలు, ముంబైతోపాటు 100 పైగా ప్రత్యేక రైళ్లు! రూట్స్‌ ఇవే..

రైలు ప్రయాణీకులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఒకవేళ మీరు దీపావళికి సొంతూరికి వెళ్లానుకుంటే భారతీయ రైల్వే బంపర్‌ గుడ్‌న్యూస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 100 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో ముంబై, ఏపీ, హైదరాబాద్‌ మీదుగా కూడా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లే ఏ మార్గం గుండా.. ఏ సమయాల్లో వెళ్తున్నాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 16, 2026, 01:14 PM IST | Updated: Sep 16, 2026, 01:18 PM IST
Image Credit: Diwali Special Trains
Join

Diwali Special Trains: సాధారణంగా ఏవైనా పెద్ద పండుగలు దసరా, దీపావళి, ఉత్తరాదివారు ఘనంగా చేసుకునే ఛత్ పూజకు అయితే, రైళ్లు దొరకడం అత్యంత కష్టం. ప్రతిరోజూ ఉదయం 8 గంటల సమయంలో రెండు నెలలకు ముందుగానే రైల్వే రిజర్వేషన్‌ చేసుకోవాలి. ఈ బిజీ సమయంలో అయితే, టిక్కెట్‌ దొరకడం చాలా కష్టం. నిమిషంలో వెయిటింగ్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది. అందుకే భారతీయ రైల్వే రైలు ప్రయాణీకులకు బంపర్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్తగా పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా 100 ప్రత్యేక రైళ్లను నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే. ఇందులో హైదరాబాద్‌తోపాటు ఏపీకి కూడా నడవనున్నాయి.

ఈ రైళ్లను భారతీయ  రైల్వే 2026 అక్టోబర్‌ నుంచి నవంబర్‌ మధ్యలో నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఉత్తరప్రదేశ, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు ఏపీ మీదుగా నడవనున్నాయి. ఇందులో రెగ్యులర్‌ రైళ్లు అదనంగా కూడా నడుస్తాయి. వీటిలో కొన్నిటికి అదనంగా కోచ్‌లను కూడా జత చేస్తున్నారు.

పండుగ రద్దీ అధికంగా ఉండే యూపీ, బిహార్‌కు ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడుస్తాయి. దీంతోపాటు బిహార్‌, బెంగాల్‌, ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.

ముంబై, ఏపీ, హైదరాబాద్‌కు ఎన్ని రైళ్లు? రూట్లు..
ముంబైకి 09189 ముంబై సెంట్రల్ నుంచి కతిహార్‌, 09190 కతిహార్‌ నుంచి ముంబై సెంట్రల్‌ కూడా అదనంగా 7 ట్రిప్పులు నడుస్తాయి.

03407 భాగల్పూర నుంచి కతిహర్‌, కతిహార్‌ నుంచి భాగల్పూర్‌ ప్రతిరోజూ ఆగష్టు 29 నుంచి నవంబర్‌ 30 వరకు మొత్తం 94 ట్రిప్పులు
విశాఖపట్టణం నుంచి SMVT బెంగళూరు(08581), SMVT బెంగళూరు నుంచి విశాఖపట్టణం అక్టోబర్‌ 2-3 నుంచి నవంబర్‌ 27-28 వరు అదనంగా 9 ట్రిప్పులు నడుస్తాయి.
08045 షాలిమార్‌ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి షాలిమార్‌ అక్టోబర్‌ 2-3 నుంచి నవంబర్‌ 27-28 వరకు అదనంగా 9 ట్రిప్పులు నడుస్తాయి. ఇందులో 24 కోచ్‌లు ఏసీ, స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయి.

Also Read:​   Atal Pension Yojana: రూ.5,000 పెన్షన్‌ఫై కేబినెట్‌ కీలకనిర్ణయం.. 2031 వరకు గ్యారంటీ!

Also Read:​   Budget 2026: ప్రతి ఏడాది బడ్జెట్‌ ముందు హల్వా వేడుక ఎందుకు జరుపుతారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం ఇదే!

అదనంగా సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ 07035, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నుంచి హైదరాబాద్‌ డెక్కన్‌కు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే నడిపిస్తోంది.

హైదరాబాద్‌ నుంచి మంగళూరు 07098, మంగళూరు సెంట్రల్‌ నుంచి హైదరాబాద్‌కు అదనంగా 12 ట్రిప్స్‌ సెప్టెంబర్‌ 9-10 నుంచి నవంబర్‌ 25-26 మధ్య నడుస్తాయి. 

ఇక 08311 సంబాల్‌పూర్‌ నుంచి పోదనూర్‌కు నవంబర్‌ 25వ తేదీ వరకు నడుస్తాయి. అదేవిధంగా పొదనూర్‌ నుంచి సంబాల్‌పూర్‌. ఇవి మాత్రమే కాదు మధురైకి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కొన్ని సర్వీసులను పొడగించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES