SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diwali Festival: దీపావళి అంటే ఆ గ్రామస్తులకు హడల్.. వందల ఏళ్లుగా పండగకు దూరం.. మహిళ పెట్టిన శాపం తెలిస్తే మైండ్ బ్లాంక్...

Woman curse on sammu village: పండగ వేళ తన భర్తను చూసేందుకు సమ్మూ గ్రామంకు మహిళ పుట్టింటి నుంచి అత్తారింటికి బయలు దేరింది. ఇంతలో ఆమె భర్త అకాల మరణం చెందినట్లు తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. తన భర్తచితితో పాటు తాను సతీసహగమనం చేసింది. ఇప్పటికి హిమచల్ ప్రదేశంలో దీపావళి జరుపువాలంటే గ్రామస్తులంతా భయపడిపోతారు.

Written By Inamdar Paresh
Published: Nov 07, 2026, 03:54 PM IST | Updated: Nov 07, 2026, 04:02 PM IST
Image Credit: diwali(file)
Join

Diwali festival is not celebrated in Sammoo village himachal Pradesh: దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దీపావళి పండగను  ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా టపాకాయల కాలుస్తే, దీపాలు వెలిగిస్తు దీపావళి పండను ఘనంగా జరుపుకుంటారు. అయితే.. చాలా మంది దీపావళిని మూడు రోజుల పాటు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండగల్ని జరుపుకుంటారు. అయితే.. దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాల్ని జరుపుకుంటుంటే  కొన్ని వందల ఏళ్లుగా హిమచల్ ప్రదేశ్ లోని సమ్ము గ్రామం మాత్రం పండగకు దూరంగా ఉంటుంది. ఇప్పటికి అక్కడి ప్రజలు దీపావళి వస్తుందంటే భయం భయంతో ఉంటారు.

 

హిమాచల్ ప్రదేశ్ లోని సుమ్మూ గ్రామంలో కొన్నేళ్ల క్రితం ఒక మహిళ  తన పుట్టింటి నుంచి అత్తారింటికి వస్తుంది.  ఆ సమయంలో అక్కడ రాజు వద్ద పనిచేస్తున్న మహిళ భర్త అకాలమరణం చెందాడు. ఆ విషయం తెలిసిన మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్. తన భర్త లేని లోకంలో ఇక ఉండనని చెప్పి, భర్తతో పాటు చితి మీద సతీసహగమనం చేసింది. ఆ సమయంలో దీపావళి పండగ కావడంతో గ్రామంలో ఎవరు కూడా దీపావళి జరుపుకొవద్దని శాపం పెట్టింది. 

ఎవరైన దీపావళిని జరుపుకుంటే చెడు జరుగుతుందని చెప్పింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఆ గ్రామ ప్రజలు దీపావళికి దూరంగా ఉంటున్నారు. కొన్నేళ్లు తర్వాత గ్రామంలొ కొంతమంది దీపావళిని జరుపుకుంటే వారి ఇల్లు కాలిపోయిందని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఇంకా బలంగా గ్రామస్తులు ఈ విషయంను పాటిస్తున్నారు. 

దీపావళి వేళ దీపావలు, టపాకాయలు కనీసం పిండి వంటలు కూడా ఆ గ్రామంలో చేసుకొవడం మానేశారు . ఇప్పటికి కూడా ఆ గ్రామంలో కొంత మంది దీపావళి పండగ వస్తుందంటే భయంతో వణికిపోతారు. ఏమి జరుగుతుందో అంటూ పండగ అయ్యే వరకు బిక్కు బిక్కు మంటూ ఉంటారు. ఈ ఘటన దీపావళి పండగ వేళ వార్తలలో నిలిచింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES