మొఘల్ చక్రవర్తుల కాలంలోనూ దీపావళి వేడుకలు.. జష్న్ఎ చిరాఘాన్ అంటే ఏమిటో తెలుసా?
Diwali In The Mughal Empire: మొఘల్ సమ్రాజ్యంలో కూడా దీపావళి పండగను కూడా జరుపుకునేవారని మీకు తెలుసా? అవును ఈ దీపాల పండుగను జష్న్-ఎ-చిరాఘాన్‌గా పిలిచేవారని అప్పటి చరిత్ర చెబుతోంది. అయితే, అప్పటి కాలంలో పండగను ఎలా జరుపుకునేవారో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Diwali In The Mughal Empire: హిందూ సాంప్రదయంలో దీపావళి పండగకి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, కొన్ని వందల ఏళ్ల క్రితం మొఘల్ రాజభవనాలలో కూడా దీపావళిని అధికారికంగా, అత్యంత వైభవంగా నిర్వహించేవారనే చరిత్ర చెబుతోంది.. మొఘల్ పాలకులు ఈ దీపాల పండుగను జష్న్-ఎ-చిరాఘాన్‌గా పిలిచేవారట.. ఈ పేరుతో దర్బారుల్లో ఘనంగా పండగను ఎంతో ఘనంగా జరిపేవారని ఆనాటి గ్రంథాలు చెబుతున్నాయి. అయితే, ఈ పండగను అప్పుడు ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మొఘల్ సామ్రాజ్యంలో పరమత సహనాన్ని మెరుగుపరిచే క్రమంలో అక్బర్ చక్రవర్తి దీపావళిని జరపడం ఆనవాయితీగా మార్చారని పురాణాలు చెబుతున్నాయి. అబుల్ ఫజల్ రచించిన ఐన్-ఇ-అక్బరీలో తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా రాజమందిరాల ప్రాంగణంలో దాదాపు 40 గజాల ఎత్తైన స్తంభంపై పెద్ద ఆకాశ దీపాన్ని ప్రతిష్ఠించేవారట.. పత్తి గింజల నూనెతో భారీ దీపాన్ని చక్రవర్తి స్వయంగా వెలిగించి దీపావళి వేడుకలను మొదలు పెట్టేవారని సమాచారం. కోట బురుజులతో పాటు గోడల వెంట వేలాది దీపాలను పెట్టడంతో పాటు ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నగరాలు విద్యుత్ వెలుగులతో అందగా ముస్తాబు చేసేవారట..
అక్బర్ కుమారుడు జహంగీర్ చక్రవర్తి కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారని సమాచారం.. తన ఆత్మకథ తుజుక్-ఎ-జహంగీరీలో ఆయన దీపావళి పండుగను కూడా చాలా అద్భుతంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.. దీపావళి రాత్రి లక్ష్మీదేవి పూజతో పాటు సంప్రదాయ పాచికలాట వంటి వేడుకల్లో దర్బారు ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొనేవారట.. ఆ రాత్రి భారీ బాణసంచా ప్రదర్శనలతో పాటు మిఠాయిల పంపిణీ కూడా చేసేవారని సమాచారం..
మొఘల్ కాలపు మినియేచర్ పెయింటింగ్స్‌లో మొఘల్ రాణులతో పాటు రాకుమార్తెలు రాణివాసం లోపల చేతుల్లో బాణసంచా పట్టుకుని కాల్చుతున్న దృశ్యాలు నేటికీ మ్యూజియంలలో అందుబాటులో ఉన్నాయి. షాజహాన్‌తో పాటు ఆయన కుమారుడు దారా షికోహ్ కూడా ఈ సంస్కృతిని కొనసాగించారని సమాచారం. ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఒక సామాజిక ఉత్సవంగా మొఘలులు దీపావళిని ఆదరించారని అప్పటి చరిత్ర చెబుతోంది..