• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

YS Anil Reddy Daughter Marriage: వై.యస్. అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎంత ఖర్చు చేశారు? పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు, ఖర్చులపై వస్తున్న వివరాలు ఏమిటి? పూర్తి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Written ByVishnu Priya
Published: Nov 07, 2026, 06:37 PM IST|Updated: Nov 07, 2026, 06:59 PM IST
joinshare
YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

2

NBCC Avenue Towers Auction: రూ.15 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్ల వేలంలో ట్విస్ట్.. 49 బిడ్లు రద్దు.. NBCCకి హైకోర్టు నోటీసులు!

3

Surekha Vani: ప్రైవేట్ వీడియోల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సురేఖా వాణి..!

4

YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

5

Tata Tiago EV Offer: టాటా టియాగో ఈవీపై దీపావళి ధమాకా ఆఫర్లు.. ఏకంగా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Anil Reddy Daughter Marriage: దేశంలో జరిగే భారీ వివాహ వేడుకలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా రాజకీయ, వ్యాపార ప్రముఖుల కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. తాజాగా చెన్నైలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ ది లీలా ప్యాలెస్‌లో జరిగిన వైయస్ అనిల్ కుమార్ రెడ్డి కూతురు.. శ్రేయ పెళ్లి వేదిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన అలంకరణలు, ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పెళ్లి వేడుకల డెకరేషన్ కోసమే సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మెహందీ, హల్దీ, సంగీత్ నుంచి అసలు పెళ్లి వరకు ప్రతి వేడుకకు ప్రత్యేకమైన థీమ్‌ను ఏర్పాటు చేశారట.

ఈ వివాహ వేడుకల కోసం ప్రముఖ వెడ్డింగ్ డిజైనింగ్ సంస్థ ది వెడ్డింగ్ స్క్వేర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెహందీ, హల్దీ వేడుకలను రంగురంగుల పూలు, అందమైన బోహో డెకరేషన్‌తో తీర్చిదిద్దారు. రాజస్థానీ సంప్రదాయంతో పాటు ఆధునిక అలంకరణలను కలిపి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశారు.

సంగీత్ వేడుక కోసం పర్పుల్, బ్లూ రంగుల ఆర్కిడ్లు, క్రిస్టల్ లైట్లు, ప్రత్యేక లైటింగ్‌తో బాల్‌రూమ్‌ను అందంగా మార్చేశారట.

అసలు పెళ్లి రోజు అలంకరణ కోసం సుమారు రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటాలియన్ ప్యాలెస్ గార్డెన్ తరహాలో వివాహ వేదికను రూపొందించారట. తెలుపు, పింక్ రంగుల లిల్లీలు, ఖరీదైన గులాబీలతో మండపాన్ని అలంకరించారు. వధూవరుల కోసం ప్రత్యేకంగా మిర్రర్ రన్‌వే కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ అలంకరణల కోసం నెదర్లాండ్స్, ఈక్వెడార్, కొలంబియా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి ప్రత్యేక పూలను తెప్పించినట్లు కథనాలు చెబుతున్నాయి.

ఈ పెళ్లిలో అతిథుల కోసం ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ వంటకాలతో పాటు ఖరీదైన డెజర్ట్స్, ప్రత్యేక ఫుడ్ మెనూ సిద్ధం చేశారట. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది.

Read More: Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!

Read More:పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
YS Jagan Mohan Reddy
AP News