• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

Singer Sunitha Divorce: తెలుగు సినీ పరిశ్రమలో తన మధురమైన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని సునీత ఉపద్రష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలతో నిండిపోయిందని చాలా మందికి తెలుసు.

Written ByVishnu Priya
Published: Nov 07, 2026, 07:02 PM IST|Updated: Nov 07, 2026, 07:05 PM IST
joinshare
Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

Singer Sunitha Divorce: మా ఇద్దరి మధ్య మనస్పర్ధలే విడాకులకు దారితీసింది.. సంచలన విషయాలు బయటపెట్టిన సింగర్ సునీత!

2

NBCC Avenue Towers Auction: రూ.15 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్ల వేలంలో ట్విస్ట్.. 49 బిడ్లు రద్దు.. NBCCకి హైకోర్టు నోటీసులు!

3

Surekha Vani: ప్రైవేట్ వీడియోల వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సురేఖా వాణి..!

4

YS Anil Reddy Daughter Marriage: లీలా ప్యాలెస్‌ పెళ్లి వేడుక కోసం వై.యస్.అనిల్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

5

Tata Tiago EV Offer: టాటా టియాగో ఈవీపై దీపావళి ధమాకా ఆఫర్లు.. ఏకంగా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Singer Sunitha Divorce: చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సునీత తన గాత్రంతో అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఆమె జీవితంలో వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కేవలం 19 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్న సునీత మొదట్లో కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగించింది. కానీ కొంతకాలం తర్వాత భర్తతో అభిప్రాయ భేదాలు రావడం మొదలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇద్దరి మధ్య తరచూ మనస్పర్ధలు పెరగడంతో చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సునీత ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా తన కథ చెప్పుకొచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని వల్ల అవుతుందని తను మొదట్లో ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చింది ఈ సింగర్. ఆ సమయంలో వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. విడాకుల తర్వాత సునీత తన పిల్లల బాధ్యత మొత్తం తీసుకుని ఒంటరిగానే జీవితాన్ని ముందుకు నడిపించింది.

తన కుమారుడు ఆకాశ్ ప్రస్తుతం హీరోగా సినీ రంగంలో కొన్ని సినిమాలు చేశారు. అలాగే కుమార్తె శ్రేయ కూడా సంగీత రంగంపై ఆసక్తి చూపిస్తూ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచిన సునీతను చాలా మంది మహిళలకు ఆదర్శంగా చూస్తున్నారు.

ఇక కరోనా లాక్‌డౌన్ సమయంలో సునీత రెండో వివాహం చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త మరియు మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిను ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో కొత్త ఆనందం వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సునీత జీవితంపై మరోసారి చర్చ జరుగుతోంది. ఆమె ఎదుర్కొన్న కష్టాలను తెలుసుకున్న నెటిజన్లు జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా నిలబడిన మహిళ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతిభతో పాటు ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చని సునీత జీవితం మరోసారి నిరూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
 

Read More: Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!

 

Read More:పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News