• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కిలోల కొద్దీ బంగారంతో ప్రత్యేక వాక్‌వే.. దుబాయ్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

కిలోల కొద్దీ బంగారంతో ప్రత్యేక వాక్‌వే.. దుబాయ్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

Dubai Gold Walkway 2026: అత్యంత తొందరలోనే దుబాయ్ గోల్డ్ వాక్‌వే ప్రారంభం కాబోతోంది. ఈ గోల్డ్ వాక్‌వేను డీరా ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, వంతెనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 18, 2026, 13:08 IST|Updated: Nov 18, 2026, 13:10 IST
joinshare
కిలోల కొద్దీ బంగారంతో ప్రత్యేక వాక్‌వే.. దుబాయ్‌లో ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dubai Gold Walkway 2026 Telugu News: అద్భుతమైన కట్టడాలతో పాటు అరుదైన ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే దుబాయ్ మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం లేదా పెట్టుబడిగా దాచుకోవడం మాత్రమే మనకు తెలుసు.. కానీ, ఇకపై స్వచ్ఛమైన బంగారంతో నిర్మించిన ప్రత్యేమైన వంతెనపై నడిచే అరుదైన అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు దుబాయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి, అత్యంత పొడవైన 24 క్యారెట్ల గోల్డ్ వాక్‌వే నిర్మాణ పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది..

దుబాయ్‌లోని డీరా ప్రాంతంలో ఉన్న  దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఈ అరుదైన వాక్‌వే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలను దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ సీనియర్ డైరెక్టర్ రషీద్ అల్ హమూదీ అధికారికంగా ఇటీవలే వెల్లడించారట.. 2026 ఏడాది చివరి నెలలోనే ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యి.. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందని మాత్రం ఆయన వివరించలేదు..

బంగారం, వజ్రాభరణాలు, బులియన్ వ్యాపారంతో పాటు అన్ని పెట్టుబడులకు సంబంధించిన సేవలను ఒకే వేదికపైకి తెచ్చే ఉద్దేశంతో 2026 జనవరిలో దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెయ్యికి పైగా రిటైల్ దుకాణాలు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇక్కడ కొత్త హోల్‌సేల్ గోల్డ్ ట్రేడింగ్ షాపుల సంఖ్య దాదాపు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే బంగారం, విలువైన రత్నాలు, లగ్జరీ వాచీల రిటైల్ షోరూమ్‌లు కూడా 15 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

24 క్యారెట్ల గోల్డ్‌తో ఈ వాక్‌వే నిర్మిస్తున్నారనే న్యూస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వివరాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వాక్‌వే నిర్మాణంలో ఎంత పరిమాణంలో బంగారాన్ని వినియోగిస్తారు.. దీని పొడవు ఎంత ఉంటుంది? ఎలాంటి సాంకేతికతను వాడుతున్నారనే విషయాలపై అధికారులు ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
Viral News