SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

EPFO Pension Hike: ఈపీఎఫ్ పెన్షన్ రూ. 3,000 పెరిగే అవకాశం.. రూ.7,500 పెంచాలని రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్!

EPFO 3000 Pension Hike: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద రిటైర్డ్ ఉద్యోగులకు అందుతున్న కనీస పింఛను మొత్తాన్ని పెంచేందుకు కేంద్ర స్థాయిలో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న కనీస పింఛన్ రూ. 1,000 స్థానంలో రూ. 3,000కు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కనీస పింఛన్‌ను కనీసం రూ. 7,500కు పెంచాలని రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రానున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై చర్చ జరగనుండటంతో లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Written By Harish Darla
Published: Nov 18, 2026, 14:59 IST | Updated: Nov 18, 2026, 15:05 IST
Join

EPFO 3000 Pension Hike: రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కనీస పెన్షన్ పెంపు అంశంపై మరోమారు విస్తృత చర్చ ప్రారంభమైంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హులైన పెన్షనర్లకు నెలకు కనీస పింఛనుగా రూ. 1,000 మాత్రమే అందుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర జీవన వ్యయాలు, భారీగా పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఈ స్వల్ప మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 3,000కు పెంచే ప్రతిపాదనపై కేంద్ర స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.

రూ.7,500 పింఛన్‌కు డిమాండ్..
ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు భావిస్తున్న రూ. 3,000 పెంపు ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సరిపోదని పెన్షనర్లు స్పష్టం చేస్తున్నారు. నేటి ఆర్థిక పరిస్థితుల్లో గౌరవప్రదమైన జీవనం సాగించాలంటే కనీస పింఛన్‌ను రూ. 7,500కు పెంచాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న నిధుల లభ్యత, సంస్థ ఆర్థిక స్థితిగతులు, పింఛన్ విధానం తదితర అంశాలపై ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి.

అర్హతలు, తుది నిర్ణయం
ఈపీఎస్ నిబంధనల ప్రకారం నెలవారీ పింఛను ప్రయోజనం పొందడానికి ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల అర్హత కలిగిన పెన్షన్ సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయస్సు పూర్తయ్యాక నిబంధనల మేరకు నెలవారీ పెన్షన్ లభిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రానున్న సమావేశంలో ఈ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. అయితే కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు రూ. 3,000 పెంపు ప్రతిపాదనను ఖరారైన నిర్ణయంగా భావించకూడదు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES