SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వామ్మో.. భారీ కొండచిలువను ఒంటిచేత్తో పట్టుకున్న మహిళ.. వీడియో!

Woman Rescues Giant Python Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక మహిళ స్నేక్ క్యాచర్ ఎంతో ధైర్యం చేసి ప్రమాదకరమైన కొండచిలువాను పట్టుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఎంతో ప్రమాదకరమైన ఆ పామును పట్టుకొని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 18, 2026, 03:19 PM IST | Updated: Oct 18, 2026, 03:19 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Woman Rescues Giant Python Video: పాము పేరు వింటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  అలాంటిది ఓ అత్యంత ప్రమాదకరమైన భారీ కొండచిలువ కళ్ళ ముందు కనిపిస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. కానీ ఒక మహిళ ఏమాత్రం భయపడకుండా.. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారీ కొండచిలువను రక్షించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలు ఊహించని స్థాయిలో వైరల్ గా మారాయి. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయి పోతున్నారు.. అయితే ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే, ఓ ప్రాంతంలో ఆహారం, ఆవాసం వెతుక్కుంటూ ఓ భారీ కొండచిలువ జనావాసాల్లోకి సంచారం చేసింది. స్థానికంగా సంచరిస్తున్న ఆ కొండచిలువను చూసి అక్కడున్న కాలనీవాసులతో పాటు ఇతర పొరుగువారి వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి ఒక మహిళా స్నేక్ క్యాచర్ చేరుకొని ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇదే సమయంలో ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సాజీయా అనే ఒక స్నేక్ క్యాచర్.. కొండచిలువను రక్షించేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది.. సాధారణంగా కొండచిలువలు పట్టుకునే క్రమంలో తమ బలమైన శరీరం వల్ల ఎదుటివారిని గట్టిగా చుట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.. ఈ క్రమంలోనే సాజియా అత్యంత జాగ్రత్తగా.. ఆ కొండచిలువ తలభాగాన్ని గట్టిగా పట్టుకున్నారు.. అయితే కొండచిలువ తన పూర్తి శరీరంతో ఆమె చేతిని బలంగా చుట్టేసింది..

చుట్టూ ఉన్నవారు ఊపిరి దిగబట్టి చూస్తున్న తరుణంలో కూడా సాజియా ఏమాత్రం ఆందోళన చెందకుండా ఉండడం ఆశ్చర్యం కలిగించింది.. కొద్దిపాటి తొందరపాటు జరిగిన ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ ఎంతో ప్రశాంతంగా ఆ యువతి పామును అదుపులోకి తెచ్చుకొని పట్టుకోవడం.. దానిని నియంత్రించడం చాలా విశేషం...

కొండచిలువను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె దానిని జాగ్రత్తగా ఒక బ్యాగులో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ భారీ కొండచిలువను సుదూరంలో ఉన్న సురక్షితమైన అడవి ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడే వదిలిపెట్టినట్లు తెలిపింది. అయితే ఆమె ఆ పామును పట్టుకోవడంతో అక్కడున్న స్థానికుల సైతం ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ యువతి పాముని పట్టుకోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES