SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఫ్లిప్‌కార్ట్ సెల్లర్‌కు భారీ షాక్.. 550 బాక్సుల్లో కొత్త షూలకు బదులు పాత బూట్లు!

Flipkart Seller Scammed: ఫ్లిప్‌కార్ట్ సెల్లర్‌కు కొంతమంది యూజర్స్‌ నిలువు దోపిడి చేశారు.. కొత్త షూ బాక్సుల్లో పాత బూట్లు పెట్టి.. రిటర్న్‌ చేశారు. ఇలా దాదాపు 550 జతలను ఇలానే పంపారట.. అయితే, షూ వ్యాపారి బాక్సులు విప్పి చూడగా షాప్ అయిపోయారట.. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 24, 2026, 12:41 IST | Updated: Nov 24, 2026, 12:44 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Flipkart Seller Scammed: ఆన్‌లైన్ షాపింగ్‌ల్లో రిటర్న్ పాలసీలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ మోసాలకు తెరలేపుతూ వస్తున్నారు. ఒకటో రెండో కాదు.. ఏకంగా 550 జతల కొత్త బూట్ల బక్సుల్లో పాత.. చిరిగిన బూట్లను తిరిగి పంపించి ఒక వ్యాపారిని నిలువునా ముంచిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది.. ఈ భారీ మోసానికి సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు ఇప్పుడు 
సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలేంటోఓ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆగ్రాకు చెందిన ఒక షూ వ్యాపారి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో తన ప్రోడక్ట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇటీవల కస్టమర్ల నుంచి రిటర్న్ వచ్చిన 550 పార్శిల్ బాక్సులను ఆ వ్యాపారి ఓపెన్‌ చేసి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట.. తాను పంపిన ఖరీదైన.. కొత్త బూట్లకు బదులుగా ఆ బాక్సులన్నింటిలో పనికిరాని.. వాడేసిన పాత బూట్లు, చెప్పులు కనిపించాయట... సాధారణ రిటర్న్‌లుగా వచ్చిన ఈ బాక్సులలో ఇలా జరగడంతో ఆ వ్యాపారికి లక్షల రూపాయలు మోసపోయానని లబోదిబోమంటున్నాడు.

బాధితుడు ఈ బాక్సులను ఓపెన్‌ చేస్తున్న సమయంలో వీడియో తీశాడు.. సాధారణంగా కస్టమర్ నుంచి వస్తువును వెనక్కి తీసుకునేటప్పుడు డెలివరీ ఏజెంట్లు బాక్సులోని వస్తువును చెక్‌ చేస్తూ ఉండడం సర్వసాధారణం. అలాంటిది ఏకంగా 550 బాక్సులలో పాత బూట్లు ఎలా మారాయనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. కొందరు కస్టమర్లు, డెలివరీ బాయ్స్ కుమ్మక్కై.. ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని ఆగ్రా ఈ-కామర్స్ సెల్లర్స్ అసోసియేషన్ సభ్యులు భావిస్తూ ఉన్నారు.

ఈ భారీ మోసంపై బాధితుడు.. స్థానిక వ్యాపార సంఘాలతో కలిసి ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియోపై స్పందించిన ఆగ్రా వెస్ట్ డీసీపీ.. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించిన్నట్లు తెలస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. బాధిత వ్యాపారికి తగిన న్యాయం చేసేందుకు పూర్తి వివరాలను తప్పకుండా సేకరిస్తున్నట్లు తెలిపారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES