Forest Staff Blocks male Lion with Motorcycles in Gujarat: ఇటీవల వన్యప్రాణుల సెఫ్టీపై ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా జంతువులను సఫారీలో ఉంచి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో జంతవుల సంఖ్య తగ్గిపోకుండా ఉండే వాతావరణంను ఏర్పాటు చేస్తున్నారు.ఈ క్రమంలో గుజరాత్ లోని గిర్ సఫారీలో సింహల సంఖ్యల్ని పెంచే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. అక్కడి సింహాల్ని ఫారెస్ట్ సిబ్బందిఎంతో జాగ్రత్తగా , కెరింగ్ గా చూసుకుంటారు. టూరిస్టులు, సఫారీని చూసేందుకు వచ్చిన వారు సైతం సింహలను దగ్గర నుంచి చూసే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా బస్సుల్ని అందుబాటులో ఉంచారు. అయితే తాజగా.. ఫారెస్ట్ సిబ్బంది సఫారీలో బైక్ మీద సంచరిస్తు ఒక సింహన్ని కంట్రోల్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
#QUESTION : Wildlife protection or unnecessary human interference? A video from Gir forest in Gujarat shows forest officials using five motorcycles to repeatedly block a male lion from moving forward, reportedly to prevent it from entering another lion's territory and threatening cubs. The footage raises serious questions about the methods being used, the safety distance maintained and whether such close human intervention is justified.
— upuknews (@upuknews1) November 15, 2026
దీనిలో ఫారెస్ట్ సిబ్బంది బైక్ మీద వెళ్తు మగ సింహంను మరో వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.అయితే.. ఇక్కడ మరో మగ సింహం, ఆడ సింహంతో కలిసి సంభోగం జరిపాయి. ఆ తర్వాత వాటికి పిల్లలు కలిగాయి.ఈ క్రమంలో సింహం.. మరో సింహం ఉంటున్న ప్రదేశంలోకి వెళ్తే వాటి మధ్య గొడవలు జరిగి పరస్పరం దాడులు చేసుకుంటాయి. పసికూనల్ని సింహం చంపేసే అవకాశం ఉంటుంది. అందుకే మరోసింహం ఉండే ప్రదేశంలోకి వెళ్లకుండా బైక్ మీద ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫారెస్ట్ సిబ్బంది అదేదో గేదెను లేదా పశువుల్ని డైవర్ట్ చేసినట్లు సింహంను తమ కంట్రోల్ లో పెట్టుకున్నారు. సింహం సైతం ఫారెస్ట్ సిబ్బంది చెప్పిన మార్గంలోనే వెళ్లింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
దీనిపై నెటిజన్ లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది వన్య ప్రాణి చట్టాల్ని అతిక్రమించారని, వాటి ప్రదేశంలోకి బైక్ మీద ఎలా సంచారం చేస్తారంటూ మండిపడుతున్నారు. మరికొంత మంది సింహల్ని కాపాడటంలో ఫారెస్ట్ సిబ్బంది చూపిన చొరవకు ప్రశంసలు కురిపిస్తున్నారు.