బ్యూటీ పార్లర్ పెట్టిన కోతులు.. ఒకదానికి మరొకటి మేకప్.. వీడియో!
Monkeys Makeup Video: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఎంతగానో సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో రెండు ఫన్నీ కోతులు ఒకదానికొకటి.. మేకప్ వేసుకుంటూ దర్శనమిచ్చాయి. అటుగా వెళుతున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే విపరీతంగా వైరల్ అవుతుంది.
Monkeys Makeup Video Watch: సాధారణంగా జంతువులు చేసే వింత చేష్టలతో పాటు కొన్ని అమాయకపు పనులు సోషల్ మీడియాలో నిత్యం ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కోతులు మనుషులు చేసే పనులను అనుసరించడంలో ఎప్పుడు ముందుంటాయి.. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో నేటిజెన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది. రోడ్డుపై ఎవరో పడేసిన మేకప్ బాక్స్ ను పట్టుకున్న రెండు కోతులు. ఏదో బ్యూటీ పార్లర్లో ప్రొఫెషనల్ బ్యూటీషియన్ల లాగే ఒకదానికొకటి ఎంతో శ్రద్ధగా మేకప్ వేసుకోవడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
రోడ్డు పక్కన పడి ఉన్న ఒక మేకప్ కిట్ గమనించిన రెండు కోతులు దాని దగ్గరికి వెళ్ళాయి. ఆ బాక్స్ ను తెరిచి అందులో ఉన్న వస్తువులను పట్టుకున్నాయి. అక్కడితో ఆగకుండా అందులో బ్యూటీ బ్రష్లను ఆ రెండు కోతులు చేతుల్లోకి తీసుకున్నాయి. ఓ కోతి డ్రెస్ తో పౌడర్ అద్దుకొని.. పక్కనే కూర్చున్న మరో కోతి ముఖంపై పూయడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత రెండో కోతి కూడా బ్రష్ ను అందుకొని మొదటి దానికి కూడా అంతే ముద్దుగా మేకప్ వేయడం ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. అవి రెండు మనుషులు మేకప్ ఎలా వేసుకుంటారు చూసి అనుసరిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేశాయి..
అయితే, అదే మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వైరల్ అవుతూనే వస్తోంది. సోషల్ మీడియాలో నైతే ఈ వీడియో ట్రెండింగ్గా కూడా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.
ఏదో సెలూన్ లేదా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసినట్లున్నాయి.. కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మనుషుల కంటే వీటికి ఫ్యాషన్స్ ఎక్కువగా ఉన్నట్లుందని మరికొంతమంది మహిళలు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరికొంతమంది ఫ్రెండ్షిప్ గోల్స్ అంటే ఇవే అంటూ సరదాగా కామెంట్లు రాస్కొస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ అందరిని నవ్వుకునేలా చేసింది.