Gun butt fight in classroom between two jee minor students in rajasthan: సమాజంలో ఇటీవల స్కూల్ కు వెళ్లాల్సిన వయసులో కొంత మంది గర్ల్ ఫ్రెండ్స్, లవర్ లు అంటూ పార్కులు, పొదలు, చెట్ల చాటున , లాడ్జీలకు వెళ్లి పెడదారిన పడుతున్నారు. చక్కగా చదువుకొవాల్సిన వయసులో స్కూల్స్ బంక్ కొట్టి మరీ పాడుపనులు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఫీజులు కడుతుంటూ వీళ్లేమో చెడు సావాసాల బారినపడి అనవసర చిక్కుల్లో పడుతున్నారు.
कोटा | Allen कोचिंग सेंटर में गोलीबारी ➡️ एक छात्रा को लेकर दो छात्रों के बीच विवाद शुरू होने की बात सामने आई। ➡️ विवाद बढ़ने पर मामला हिंसक हो गया। ➡️ आरोप है कि एक छात्र ने बैग से पिस्तौल निकालकर दूसरे छात्र पर गोली चला दी। ➡️ घटना के बाद कोचिंग सेंटर में हड़कंप मच गया। ➡️ पुलिस मामले की जांच में जुटी है। #Kota #KotaNews #Allen #Firing #Rajasthan #BreakingNews
— NCR पत्रिका (@ncrpatrika) October 17, 2026
అమ్మాయి కోసం దాడులు చేయడం, హత్యలకు కూడా వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ లోని కోటాలో ఉన్న కోచింగ్ సెంటర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ లోని కోటాలో ఉన్న అలెన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కాల్పుల కలకలం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జేఈఈ ఇన్స్టిట్యూట్ లో ఇద్దరు మైనర్లు ఒక అమ్మాయి విషయంలో గొడవలు పడ్డారు. అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది.
దీంతో ఒక బాలుడు తన బ్యాగ్ లో తుపాకీ తెచ్చుకున్నాడు. అతను మరో బాలుడి తనపై గన్ తో బలంగా కొట్టాడు. దీంతో బాధితుడు ఒక్కసారిగా రక్తపుమడుగులో కుప్పకూలీపోయాడు. వెంటనే అతడ్ని చుట్టుపక్కల ఉన్న సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
అతని సిట్యువేషన్ ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనతో క్యాంపస్ అంతా టెన్షన్ గా మారిపోయింది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందింస్తున్నారు. అసలు స్కూళ్లు, కోచింగ్ సెంటర్ లలో పిల్లల భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.