Andhra Pradesh Police Open gun fire in Pulivendula: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా పలు చోట్లనామినేషన్ల విషయంలో సైతం స్థానికనేతలు, పార్టీల మధ్య గొడవలు, పరస్పరం దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయచోటి, పుంగనూరులో జరిగిన అల్లర్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. నామినేషన్ల ప్రక్రియలు, శాంతి భద్రతలను కాపాడటంలో నెగ్లీజెన్సీగా ప్రవర్తిస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
బిగ్ బ్రేకింగ్ః పులివెందులలో వైసీపీ శ్రేణులపై కాల్పులు తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, తిరిగి తమను అడ్డుకోవడంతో పాటు రౌడీ మూకలకు అండగా నిలిచారని కడప ఎంపీ అవినాష్రెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీ అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా పోలీసులు నిలువరించినట్టు సమాచారం.
— greatandhra (@greatandhranews) October 17, 2026
ఎక్కడైనా ఘర్షణలు జరిగితే వెంటనే అదనపు బలగాలను మోహరించాలని, శాంతి భద్రతలను కాపాడాలని తెల్చి చెప్పింది. నామినేషన్ల వద్ద ఒక అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎక్కువ మందిని అనుతించకూడదని తెల్చి చెప్పారు. అయితే కడప జిల్లాలోని పులి వెందులలో నామినేషన్ ల ప్రక్రియ టెన్షన్ గా మారింది. ఏపీలోని కడపలోని పులివెందులలో నామినేషన్ల పర్వం కాస్త స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికంగా ఉన్న నామినేషన్ కేంద్రంలోకి టీడీపీ నేతలు వెళ్లారు . వీరీ వెనుకాల వైసీపీ వారు కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీడీ వారు వచ్చిన తర్వాత వెళ్లాలని సూచించారు. కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులను లెక్కచేయలేదు. తోచుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరస్సరం వ్యతిరేక నినాదాలతో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులు గాల్లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. వైసీపీ వారికి అక్కడి నుంచి దూరంగా చెదరగొట్టారు. దీంతో అక్కడ పోలీసులకు,వైసీపీ కార్యకర్తలక మధ్యతోపులాట జరిగింది.దీంతో పులి వెందులలో నామినేషన్ దాఖలు వేళ ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు హీటెక్కాయి.