Garbha dandiya Row: మరీ ఇంత కక్కుర్తీనా..?... దాండియా తర్వాత కుప్పలుగా డ్రెస్లు రిటర్న్ పెట్టిన అమ్మాయిలు.. వీడియో ..
Garbha dance woman outfits video: మహిళలు పలుచోట్ల దాండియా తర్వాత ఆన్ లైన్ లో తమ డ్రెస్ లను రిటర్న్ ఆర్డర్ లు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందింస్తున్నారు.
Garba Dandiya participants are returning their worn outfits video: దేశ వ్యాప్తంగా దుర్గశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలుచోట్ల అమ్మవారిని మండపాలలో ప్రతిష్టించుకుని ఘనంగా పూజించుకుంటున్నారు. అయితే చాలా చోట్ల దేవీ నవరాత్రుల్లో దాండియా, గర్బాలు ఆడతారు. అమ్మాయిలు ముఖ్యంగా అందంగా ముస్తాబై మరీ దాండియా ఆడతారు. దీని కోసం నార్త్ లో ఈవెంట్ లను కూడా కండెక్ట్ చేస్తున్నారు. గర్భాకు ప్రత్యేకంగా ఈవెంట్ లను ఏర్పాటు చేసి దానికి డబ్బులను సైతం కలెక్ట్ చేస్తున్నారు. ఇక గర్బాకు వెళ్లే అమ్మాయిలు ఒక రేంజ్ లో రెడీ అవుతారు.
ఇక ఆన్ లైన్ ప్లాన్ ఫామ్ లలో నచ్చిన దుస్తులను ఆర్డర్ పెడతారు. అంతే కాకుండా కొంత మంది కక్కుర్తితో ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన డ్రస్ లను గర్బాల్లో ధరించి రోజంతా దాని మీద దాండియా ఆడి మరుసటి రోజు రిటర్న్ పెడుతున్నారు.కేవలం ఓక రోజుకు వీరు డ్రెస్ లను ఆర్డర్ పెట్టి ఆతర్వాత మరల రిటర్న్ పెడు తున్నారు. ఇలాంటి వారు ఇటీవల నార్త్ లో పలు చోట్ల డ్రెస్ లను కుప్పలు తెప్పలుగా రిటర్న్ చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది అమ్మాయిలు దాండియా తర్వాత అవుట్ ఫిట్ లను కుప్పలు, తెప్పలుగా రిటర్న్ పెట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అమ్మాయిలేంట్రా మరీ ఇంత కక్కుర్తిలా ఉన్నారు.. పాపం రోజంతా వేసుకుని దాండియా తర్వాత రిటర్న్ పెట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా ఇలా చేస్తు భవిష్యత్తులు ఆన్ లైన్ ప్లాన్ ఫామ్ లు రిటర్న్ పాలసీని క్లోజ్ చేస్తాయని కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.