Shukra moudyami dates tradition and facts: దుర్గా దేవీ శరన్నవరాత్రులు ముగింపు దశకు వచ్చాయి. ఎక్కడ చూసిన అమ్మవారిని భక్తి, శ్రద్దలతో పూజించు కుంటున్నారు. ఇక స్కూళ్లకు, కాలేజీలకు దసరా పండగ సెలవులు ప్రకటించడంతో బస్ స్టేషన్ లు,రైల్వేలు ఫుల్ గా ప్రయాణికులతో నిండి పోయాయి. అంతే కాకుండా ఎక్కడ చూసిన కూడా రోడ్లపై వాహనాలతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో మనకు ఈసారి దసరా పండగ అనేది శుక్రమూఢమిలో రావడంతో ప్రజలు ఒకింత ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19న మొదలై 29 వరకు కొనసాగనుంది.
ముఖ్యంగా శుక్ర, గురు గ్రహలు సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల వాటి శక్తిని కోల్పోయి ఈ రోజుల్లో చీకటిగా ఉంటాయని చెప్తారు. అంటే ఆయా గ్రహాలు శక్తిహీనంగా ఉంటాయన్న మాట.ఈ సమయంలో శుభకార్యక్రమాలు పూర్తిగా నిశిధ్దమని చెప్తారు. అయితే.. మనకు నవమి, దసరా పండగలను జరుపుకొవాలో లేదా అని చాలామంది సందేహ పడుతున్నారు.
అయితే మూఢమి వేళ నవమి రోజున ఆయుధ పూజలు,వాహన పూజలు, దశమి రోజున శమీ పూజలు మొదలైనవి యథా ప్రకారం చేసుకొవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కానీ శుభకార్యక్రమాలు అంటే.. పెళ్లిళ్లు, గృహప్రవేశం, ఉపనయనం, అన్న ప్రసాన, శంకుస్థాపనలు, కొత్త వాహనాలు కొనడం మొదలైనవి చేయోద్దని పండితులు చెబుతున్నారు. మనం ఈసారి మహర్నవమిని సోమవారం రోజున ఆతర్వాత దసరా పండగను అక్టోబర్ 20న మంగళవారం రోజున జరుపుకొవాలని పండితులు సూచిస్తున్నారు.
కానీ ఈ సమయంలో దేవతారాధన,నదీస్నానం, జపాలు, హోమాలు, శాంతులు, పూజలు మొదలైనవి చేసుకొవచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అక్టోబర్ 29 తర్వాత మరల శుభకార్యాలు చేసుకొవచ్చని పండితులు చెబుతున్నారు.