SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bengaluru: బెంగళూరులో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తుండగా భారీ పేలుడు.. వీడియో వైరల్..

Gas Cylinder blast in Bengaluru: గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డెలవరీ చేసే వ్యక్తివెంటనే దాని మీద బట్టలు వేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అంతే కాకుండా సిలిండర్ మీద బకెట్లతో నీళ్లు కూడా గుమ్మరించాడు. ఈ షాకింగ్ ఘటన నెట్టింట వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 04, 2026, 12:39 PM IST | Updated: Nov 04, 2026, 12:49 PM IST
Image Credit: Gay cylinder blast bengaluru
Join

Gas Cylinder catching fire during delivery in Bengaluru: మనం ఇంట్లో పనులు చేస్తుండగా ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కొన్నిసార్లు అనుకొకుండా ప్రమాదాలు జరుగుతాయి. ఆ సమయంలో మనం ఏవిధంగా స్పందిస్తామో అన్నదానిపై కొన్నిసార్లు ప్రమాదాల తీవ్రత ఆధార పడి ఉంది. సరైన సమయంలో చాకచక్యంగా ప్రవర్తిస్తే ఎంత పెద్ద ప్రమాదం నుంచైన ఈజీగా బైటపడవచ్చు. తాజాగా.. బెంగళూరులో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 


బెంగళూరులోని మల్లేశ్వరంలోని ఊహించని భయానక ఘటన చోటు చేసుకుంది. ఎల్పీజీ సిలిండర్ డెలీవరీ చెద్దామని కార్మికుడు సిలిండర్ తో పాటు ఇంటికి వచ్చాడు. డోర్ ముందు గ్యాస్ సిలిండర్ పెట్టాడు. ఇంతలో సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అరుపులు పెట్టడంతో ఇంట్లోని వారు బైటకు వచ్చి డెలివరీ బాయ్ కు బకెట్లలో నీళ్లు ఇచ్చారు. 

అంతే కాకుండా బట్టలతో డెలీవరీ బాయ్ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించాడు. మొత్తంగా నీళ్లు, బట్టలు సిలిండర్ మీద వేయగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల వారు అలర్ట్ అయి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు మంటలు చెలరేగిన ఘటన స్థలంను పరిశీలించారు. అయితే.. గోడ మీద సదరు ఇంటి ఓనర్ దీపం వెలిగించి పెట్టారని, సిలిండర్ నుంచి అప్పటికే గ్యాస్ లీక్ అవుతుండటంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. పెద్ద ప్రమాదం తప్పడంతో ఇంట్లోని వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES