• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Telangana 10th Exam Fees: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు మొత్తం చెల్లిస్తా: బండి సంజయ్ హామీ

Telangana 10th Exam Fees: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు మొత్తం చెల్లిస్తా: బండి సంజయ్ హామీ

Bandi Sanjay to Pay 10th Exam Fees: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి అండగా నిలిచారు. పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. దీంతో మొత్తం 10 వేల 959 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

Written ByAshok Krindinti
Published: Nov 04, 2026, 02:04 PM IST|Updated: Nov 04, 2026, 02:06 PM IST
joinshare
Telangana 10th Exam Fees: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు మొత్తం చెల్లిస్తా: బండి సంజయ్ హామీ
Image Credit: Bandi Sanjay to Pay 10th Exam Fees (Source: Facebook)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఎవరినీ తక్కువ అంచనా వేయకు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు చెబుతున్న భూస్వామి, జీతగాడు నీతి కథ..!!

ఎవరినీ తక్కువ అంచనా వేయకు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు చెబుతున్న భూస్వామి, జీతగాడు నీతి కథ..!!

2

Tirumala: తిరుమల నడక మార్గంలో పెను విషాదం.. ఎన్నారై భక్తుడు మృతి.. కారణం ఏమిటంటే..?..

3

Modi Phone Call: ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు

4

భారత్‌లో భారీగా తగ్గిన పేదరికం.. ప్రపంచ బ్యాంక్ నివేదికలో కీలక విషయాలు..!

5

Telangana 10th Exam Fees: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు మొత్తం చెల్లిస్తా: బండి సంజయ్ హామీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bandi Sanjay to Pay 10th Exam Fees: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థులందరికీ ఈ ఏడాది సైతం ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిర్ణయించారు. తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(తపస్) కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అన్నపునేని తిరుపతిరావు, జారతి నర్సయ్య 5 రోజుల క్రితం కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వాటిని బలోపేతం చేయడం కోసం బండి సంజయ్ తీసుకుంటున్న చర్యలు అమోఘమని వారు కొనియాడారు.

అందులో భాగంగా సీఎస్సార్ నిధులతోపాటు ఇతర సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. గతేడాది టెన్త్ చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించి ఆదుకున్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుకునే విద్యార్థులంతా అత్యంత పేదవారు కావడం, పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ ఏడాది సైతం అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని  బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సర్కారీ  స్కూళ్లలో టెన్త్ చదువుకునే విద్యార్థులందరి ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

ఈ మేరకు సంబంధిత జిల్లాల డీఈఓలకు సమాచారం అందించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 10 వేల 959 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920, కరీంనగర్ జిల్లాలో 4,356, జగిత్యాల జిల్లాలో 1087, సిద్దిపేట జిల్లాలో 1133, హన్మకొండ 463 మంది విద్యార్థులు ఉన్నారు. బండి సంజయ్ తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ ఎంతో మేలు జరగనుంది. ఆయా విద్యార్థుల ఎగ్జామ్ ఫీజు మొత్తం ఎంత అవుతుంది..? అనే వివరాలను సంబంధిత జిల్లాల డీఈఓల నుంచి సేకరించి రెండు, మూడు రోజుల్లో ఆ మెత్తాన్ని చెక్ రూపంలో చెల్లించాలని కేంద్ర మంత్రి నిర్ణయించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Karimnagar
Telangana News
Politics