Marriage Course: పెళ్లికి కూడా ఈ రాష్ట్రంలో స్పెషల్ కోర్సు.. ఆ విషయాల్లో ప్రత్యేక క్లాసులు.. అసలు విషయం ఇదే..
Goa college course on marriage: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లిళ్లు చేసుకుని ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడి డైవర్స్ లు చేసుకొవడం చేస్తున్నారు. దీంతో గోవాలోని కాలేజీలో పెళ్లిపై ఒక ప్రత్యేకంగా కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Goa college launches new course on marriage: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లిళ్లు చేసుకుని చిన్న చిన్న విషయాలను పెద్దది చేసుకుంటున్నారు. పెళ్లైన తర్వాత ఏదైన గొడవ జరిగితే డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. మరి కొంత మంది కట్టుకున్న వాళ్లను సుపారీలు ఇచ్చి హత్యలు చేస్తున్నారు. కనీసం కుటుంబం పరువు , పిల్లల గురించి కూడా ఆలోచించకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. దీంతో గోవాలోని ఒక కాలేజీ వివాహంకు రెడీ అవుతున్న యువతీ,యువకులకు సర్టిఫికేట్ కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోవా కాలేజీ ఆఫ్ హోమ్ సైన్స్ మ్యారేజ్ రెడీనెస్: ప్రి పేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్ షిప్స్ పేరిట గోవా కాలేజీ ఆఫ్ హోమ్ సైన్స్ పాఠాలు బోధించనుంది. దీనిలో కుటుంబ అధ్యయనాలపై క్లాసులను బోధిస్తారు.
డిసెంబర్ 2 నుంచి 17 వతేదీ వరకు తరగతులు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ మహేష్ పాయ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా డైవర్స్ సంఖ్యను తగ్గించేలా, వివాహనికి ముందు కౌన్సెలింగ్ ఇచ్చేలా గోవా ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుందని సీఎం ప్రమోద్ సావంత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కోర్సులో ముఖ్యంగా.. డేటింగ్ ఉద్దేషం, అరెంజ్ డ్ మ్యారెజ్ వర్సెస్ లవ్ మ్యారెజ్ ల మధ్య తేడా, వివాహ బంధం, మహిళలు, పురుషుల పాత్ర మొదలైన అంశాలు ఈ కోర్సులో భాగంగా ఉంటాయని కాలేజీ నిర్వాహకులు తెలిపారు.
దీనిలో డిగ్రీ పూర్తయిన వారు, పీజీ, పెళ్లికి రెడీ అవుతున్న వారు, పెళ్లి కానీ వారు అందరు జాయిన్ అవ్వొచ్చని కళాశాల ఒక ప్రకటనలో తెలిపింది. 15 రోజుల పాటు ఈ కోర్సు కొనసాగుతుందని అన్ని విషయాల్లో యువతీ, యువకులకు సరైన విధంగా క్లాసుల్ని బోధిస్తారని కాలేజీ నిర్వాహకులు తెలిపారు. జీవితంలో మంచిగా చదువుకుని, జాబ్ వచ్చాక పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత గొడవలు పడి చాలా మంది డైవర్స్ లు, కట్టుకున్న వారిని హత్యలు చేయడంపై గోవా సీఎం ఆందోళనలు వ్యక్తం చేశారు.
గోవా రాష్ట్ర న్యాయ శాఖ గణాంకాల ప్రకారం, 2022 నుంచి 2025 మధ్య గోవా సివిల్ కోర్టులలో వివాహ, విడాకులకు సంబంధించిన 3,000కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కేవలం 2024లోనే 947 పిటిషన్లు ఉన్నాయి. దీంతో యువతీ, యువకుల్లో అవగాహన కోసం ఈకోర్సును ప్రారంభిస్తున్నట్లు గోవా కాలేజీ ఒక ప్రకటనలో తెలిపింది.