Google Pixel 10aపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.6,200 వరకు డిస్కౌంట్!
Google Pixel 10a Price After Discount: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 10a (Google Pixel 10a) మొబైల్ అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి భారీ తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pixel 10a Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా అనేక ఎలక్ట్రిక్ వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై బంపర్ ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అద్భుతమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. అయితే, ఈ సేల్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం బెస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది యువత ఇప్పుడు రూ.45,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా అద్బుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం డిజైన్ కలిగిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, యువత మాత్రం ఈ సేల్‌లో ఎక్కువగా గూగుల్ పిక్సెల్ 10a (Google Pixel 10a) మొబైల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్ కూడా దీనిపై స్పెషల్‌గా ఆఫర్స్ కూడా అందిస్తూ వస్తోంది.
ధర, బ్యాంక్ ఆఫర్ల వివరాలు ఇవే..
ఈ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన ఈ గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999గా ఉంది. అయితే, ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి అద్బుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.6,200 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఆఫర్ పోనూ పిక్సెల్ 10a ఎఫెక్టివ్ ధర కేవలం రూ.41,799 మత్రమే అవుతుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కూడా ఈ ఆఫర్స్ పొందవచ్చు..
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.3 అంగుళాల pOLED డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఇది గూగుల్ టెన్సర్ G4 (Google Tensor G4) అద్బుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. డేటా ప్రొటక్షన్ కోసం టైటాన్ M2 (Titan M2) సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది.. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు గూగుల్ ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు కూడా లభించడం విశేషం..