• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /India vs West Indies 2nd T20: రాంచీలో విండీస్‌తో రెండో సమరానికి సై.. తుది జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

India vs West Indies 2nd T20: రాంచీలో విండీస్‌తో రెండో సమరానికి సై.. తుది జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

India vs West Indies Playing 11: జోరుమీదున్న టీమిండియా.. విండీస్‌తో రెండో సమయానికి సిద్ధమైంది. నేడు రాంచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో పట్టు బిగించాలని భారత్ భావిస్తుండగా.. ఎలాగైనా పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని కరీబియన్ సేన పట్టుదలగా ఉంది.

Written ByAshok Krindinti
Published: Oct 09, 2026, 03:23 PM IST|Updated: Oct 09, 2026, 03:25 PM IST
joinshare
India vs West Indies 2nd T20: రాంచీలో విండీస్‌తో రెండో సమరానికి సై.. తుది జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!
Image Credit: India vs West Indies Playing 11 (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కరెంట్ బిల్లు సున్నా చేసే సూపర్ స్కీమ్.. రూ.78 వేల సబ్సిడీతో ఎలా పొందాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

కరెంట్ బిల్లు సున్నా చేసే సూపర్ స్కీమ్.. రూ.78 వేల సబ్సిడీతో ఎలా పొందాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!

2

Uttar Pradesh: యూపీలో ఘోరం.. నిద్రలో ఉన్న భర్త ప్రైవేటు పార్ట్‌‌ను కట్ చేసిన భార్య.. అసలు విషయం ఇదే..

3

ప్రభుత్వ ఉద్యోగం కోసం 17 ఏళ్ల పోరాటం.. కోర్టుల చుట్టూ తిరిగి చివరకు కాంట్రాక్ట్ కొలువులేనా? DSC-2008 అభ్యర్థుల ఆవేదన..!!

4

గేమర్స్‌కు గుడ్ న్యూస్.. అక్టోబర్ చివరి వారంలో ఐకూ నియో 12 సిరీస్‌ లాంచ్? ఫీచర్స్ లీక్‌!

5

ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్, బర్త్‌డే వేడుకలు చేయొద్దు! అర్ధరాత్రి హంగామాపై సీపీ సజ్జనర్ తీవ్ర హెచ్చరికలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs West Indies Playing 11: తొలి టీ20 పోరులో విండీస్‌ను అలవోకగా చిత్తు చేసి జోరుమీదున్న భారత్.. నేడు రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో రెండో టీ20 సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ఓటములను మరిపిస్తూ.. భారత్ వరుసగా 10 టీ20ల్లో విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా.. టీమ్ బలంగానే ఉంది.

టీమిండియా బ్యాటింగ్‌లో మంచి ఊపుమీద ఉన్నా.. ఓపెనర్ సంజు శాంసన్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 9, 7, 2, 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా విఫలమైతే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మళ్లీ తెరపైకి వస్తాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 43 బంతుల్లోనే 102 పరుగులతో అజేయ శతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మంచి టచ్‌లో ఉన్నారు. ఇక శివమ్ దూబె కూడా బ్యాట్‌తో సత్తా చాటాల్సి ఉంది. బౌలింగ్‌లో నమన్ ధీర్ (3/31) అరగేంట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్ ప్రత్యర్థిని కట్టడి చేశారు. తొలి మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించిన మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశముంది.

మరోవైపు భారీ హిట్టర్లతో నిండిన వెస్టిండీస్.. తొలి టీ20లో 171 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ షై హోప్ సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నా.. ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. హెట్‌మెయర్, పావెల్, రూథర్‌ఫోర్డ్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో నిలకడలేమి వారిని దెబ్బతీస్తోంది. టీమిండియా బౌలింగ్‌ అటాక్‌ను ఎదుర్కొని భారీ స్కోరు సాధిస్తేనే భారత్‌కు కళ్లెం వేయగలమని కరేబియన్ జట్టుకు తెలుసు. బౌలింగ్‌లో కూడా ఇంకా మెరుగవ్వాలి. స్పిన్నర్ అకీల్ హొసేన్ మినహా మిగతా బౌలర్లు పూర్తి లయను అందుకోవాల్సి ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డులు..

  • మొత్తం మ్యాచ్‌లు: 32
  • భారత్ గెలిచినవి: 21
  • వెస్టిండీస్ గెలిచినవి: 10
  • ఫలితం తేలనివి: 1

తుది జట్లు ఇలా.. (అంచనా):  

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

వెస్టిండీస్: షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కామిల్ పూరన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మెయర్, రోవ్‌మన్ పావెల్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, కీమో పాల్, అకీల్ హొసేన్, స్ప్రింగర్, షమర్ జోసెఫ్.

మ్యాచ్ వివరాలు ఇలా..

  • వేదిక: JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్, రాంచీ.
  • టాస్ సమయం: సాయంత్రం 6:30 గంటలకు.
  • మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7:00 గంటలకు.
  • టీవీ ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్.
  • లైవ్ స్ట్రీమింగ్: జియోహాట్‌స్టార్ (యాప్, వెబ్‌సైట్).
Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News