Delhi: ఢిల్లీలో ఒక్కసారిగా పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు జారీ చేసిన అధికారులు .!.
Grap 1 imposed in Delhi: వాయు కాలుష్యం క్రమంగా పెరగడం వల్ల ప్రభుత్వం గ్రాప్ 1 నిబంధల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ప్రజలు ఈ కింది నిబంధనల్ని పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
Grap 1 curb restriction imposed in delhi ncr: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య క్రమంగా పెరుగుతుంది. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో గ్రాప్ 1 నిబంధలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. వాయు నాణ్యత ఢిల్లీలో పూర్ లెవల్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రోజున ఢిల్లీలో వాయు నాణ్యత 244 గా నమోదైంది. దీంతో గ్రాప్ 1 ఆంక్షల్ని అధికారులు జారీ చేశారు. దసరా వేడుకలు ముగిసిన మరుసటి రోజే ఈ ఆంక్షలు విధించడం వార్తలో నిలిచింది. ప్రతి ఏటా చలికాలంకు ముందు ఢిల్లీలో పొగమంచు అలుముకుంటుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం, తక్కువ వేగంతో గాలులు వీయడం వంటి వాటి వల్ల ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఎయిల్ క్వాలిటీ ఇండెక్స్.. 201 నుంచి 300 మధ్య ఉన్నప్పుడు మొదటి దశ (Stage I) వర్తిస్తుంది. ఈ క్రమంలో మరింత కాలుష్య స్థాయిలు పెరిగకుండా అధికారులు పలు ఆంక్షలు జారీ చేశారు.
తాజా ఆంక్షల ప్రకారం.. ఢిల్లీలోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర చోట్లా ఎక్కడా వంట కోసం బొగ్గును, వంటచెరుకువాడకంవంటివి చేయరాదు. డీజిల్ జనరేటర్లను కూడా అత్యవసర పరిస్తితుల్లో తప్ప ఉపయోగించరాదని అధికారులు సూచించారు. ఈ మొదటి దశ ఆదేశాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లోని ఎన్‌సిఆర్ ప్రాంతాల పరిధిలో వర్తిస్తాయని అధికారులు సూచించారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో దేశంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఢిల్లీ ప్రభుత్వ శీతాకాల కార్యాచరణ ప్రణాళికకు ముందే GRAP ఆంక్షలు అమల్లోకి రావడం ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అదే విధంగా.. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదనే విధానంను ఢిల్లీలో అమలు చేయనున్నారు.
అందుకే వాహన దారులు తప్పనిసరిగా తమతో పొల్యుషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లను పెట్టుకొవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనితో పాటు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు, దుమ్ము పర్యవేక్షణను కఠినతరం చేయడం, యంత్రాలతో రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమాలను పెంచడం వంటి ప్రణాళికలను కూడా అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.