SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంజినీరింగ్ పూర్తి చేశారా? HAL నుండి బిగ్ నోటిఫికేషన్! రూ.1.2 లక్షల వరకు జీతం, అప్లై ప్రాసెస్ ఇదే!

నిరుద్యోగులకు శుభవార్త! హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2026 మొత్తం 150 ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇతర వివిధ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. ఏరోనాటికల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, ప్రొడక్షన్ వంటి వివిధ విభాగాల్లో పట్టా పొందిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్‌ https://hal-india.co.in/లో నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి, అక్టోబర్ 17వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Written By Renuka Godugu
Published: Oct 08, 2026, 10:04 AM IST | Updated: Oct 08, 2026, 10:07 AM IST
Image Credit: HAL Recruitment 2026
Join

HAL Notification 2026: HAL నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మొత్తం 150 పోస్టుల కోసం దరఖాస్తులు నిన్నటి నుండి ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు నవంబర్ నెలలో నిర్వహిస్తారు.

ఈ రిక్రూట్‌మెంట్‌కు డిగ్రీ తప్పనిసరి. అభ్యర్థులు తప్పనిసరిగా రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగా ఉండగా, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు వివరాలను జాగ్రత్తగా నింపాలి, లేనిపక్షంలో దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంది. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులు రూ. 500తో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది. అయితే SC, ST, PwBD అభ్యర్థులకు ఎటువంటి రుసుము ఉండదు.

ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం లభిస్తుంది. ట్రైనీ సమయంలో రూ. 30,000 జీతంతో పాటు DA, హౌస్ రెంట్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్ బోనస్, మెడికల్ ఫెసిలిటీ, PF, గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. రెండేళ్ల తర్వాత, మూడవ సంవత్సరం నుండి 3 శాతం ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు HAL అధికారిక వెబ్‌సైట్‌ https://hal-india.co.in/ను సందర్శించి, నిర్ణీత గడువులోపు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది, వివరాలు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES