• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ

Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ

Revanth Reddy Speech In Bharat Summit: ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే.. మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోందని.. భారతదేశాన్ని కాపాడుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని తాము కోరుకుంటున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 14, 2026, 05:28 PM IST|Updated: Nov 14, 2026, 05:31 PM IST
joinshare
Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ
Image Credit: Revanth Reddy Bharat Summit Speech

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

2

Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ

3

Harish Rao: తెలంగాణ ప్రజలకు అదొక్కటే సరిపోదు రాహుల్‌ గాంధీ: హరీశ్‌ రావు

4

Kajal Aggarwal Love Story: 14 ఏళ్ల క్రితమే ప్రేమ.. బ్రేకప్ తర్వాత మళ్లీ ఒక్కటైన జంట.. పెళ్లిపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

5

Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. 6 వాహనాల కొనుగోలుకు అనుమతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth Reddy Speech: 'భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి రోజున జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. భారతదేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి నెహ్రూ దార్శనికత ఎంతో దోహదపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో శనివారం జరిగిన భారత్ సమ్మిట్‌ ముగింపు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రపంచవ్యాప్తంగా ఒకే ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులను, ప్రభావశీలురను ఒకే వేదికపైకి తీసుకురావడానికి భారత్ సమ్మిట్ గొప్ప వేదిక. 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వం చాలామందికి వీసాలను రద్దు చేసింది. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు మనల్ని గమనిస్తున్నారని నేను నమ్ముతున్నా' అని తెలిపారు.

'మేము రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. కానీ వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారు' అని తెలంగాణ సీఎం విమర్శించారు. తాము పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నామని.. కానీ వారు పర్యావరణాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు.

'ముఖ్యంగా పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమ సంపన్న మిత్రులను మాత్రమే కాపాడుకోవాలని చూస్తున్నారు' అని కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని తాము కోరుకుంటున్నామని.. కానీ వారు కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించాలని చూస్తున్నారని తెలిపారు. చర్చలు, సంప్రదింపులను కోరుకుంటుంటే.. కానీ వారు ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

'మమ్మల్ని ఆపగలమని వారు భావిస్తున్నారు. కానీ అది వారి భ్రమ మాత్రమే. మేము ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నంత కాలం ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచీకరణ, కోవిడ్ తర్వాత అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని.. ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయని వెల్లడించారు.

'ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని మనపై ఆశలు పెట్టుకున్నారు. మనపై ఎంతో గొప్ప బాధ్యత ఉంది. మనమందరం కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తాం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీ దేశంలో ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని.. ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం కోసం పోరాడుతున్నారని తలెఇపారు. దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడం కోసం రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు.

'ఈ పోరాటంలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి. ఆయన నాయకత్వంలో ఈ మార్పును తీసుకువస్తాం. ప్రభుత్వం సంపన్నుల కోసం పనిచేయడం మానుకోవాలి. ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి' అని రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రపంచవ్యాప్తంగా మనమందరం ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని.. అందరం కలిసి రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాడి మన దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ గొప్ప లక్ష్యం కోసం అందరం చేతులు కలిపి పోరాడుదామని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Rahul Gandhi
Telugu News
Telangana News