HMD Vibe 2 5G : పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు కూడా సేల్స్‌ను ప్రారంభించాయి. ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని టెక్ కంపెనీలు కూడా స్పెషల్ ఎడిషన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా హెచ్‌ఎమ్‌డీ (HMD) కూడా మే నెలలో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదే హెచ్‌ఎమ్‌డీ వైబ్ 2 5G (HMD Vibe 2 5G)మొబైల్.. అయితే, దీనిని కంపెనీ దీపావళి స్పెషల్ ఎడిషన్ పేరుతో అద్భుతమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఇది వైన్ రెడ్ (Wine Red) రంగులో అందుబాటులోకి వచ్చాయి. అయితే, త్వరలో అందుబాటులోకి రాబోయే బిగ్ బిలియన్ సేల్స్‌లో ఈ కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ అన్ని ఆఫర్స్‌తో కలిపి కేవలం రూ.10,499కే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) లో భాగంగా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. అయితే, ప్లస్ మెంబర్స్‌కి ఇది అక్టోబర్ 8వ తేదినే లభించబోతోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా లభించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
డిస్‌ప్లే వివరాలు..
HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. 6.7 అంగుళాల భారీ LCD స్క్రీన్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది HD+ రిజల్యూషన్‌తో పాటు మంచి స్క్రోలింగ్ అనుభూతినిచ్చే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఫోన్ బాడీ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో ఉన్నప్పటికీ.. ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 6nm ప్రాసెస్‌పై అందుబాటులోకి తీసుకు వచ్చిన.. ఆక్టా-కోర్ Unisoc T8200 చిప్‌సెట్ ప్రాసెసర్ కూడా కలిగి ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్, రోజువారీ వాడకానికి చాలా అద్భుతంగా సరిపోతుంది.
కెమెరా వివరాలు ఇవే..
ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో చాలా ప్రత్యేకమైన 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 6000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్-సి పోర్ట్ సపోర్ట్‌ను కూడా అందించింది. ఇవే కాకుండా చాలా అద్బుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.