SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అక్కడ ఉద్యోగులకు రోజూ పండగే.. ప్రపంచంలోనే అత్యధిక పబ్లిక్ హాలిడేస్ ఉన్న ఏకైక దేశం ఏదో తెలుసా?

Holidays: ఉద్యోగులు కావచ్చు.. విద్యార్థులు కావచ్చు.. చివరికి సామాన్య ప్రజలైనా.. ప్రభుత్వ సెలవు అనగానే ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. పండగలు, జాతీయ పర్వదినాల వేళ లభించే సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 01, 2026, 02:20 PM IST | Updated: Oct 01, 2026, 02:22 PM IST
Image Credit: Holidays
Join

Holidays: ఉద్యోగులు కావచ్చు.. విద్యార్థులు కావచ్చు.. చివరికి సామాన్య ప్రజలైనా.. ప్రభుత్వ సెలవు అనగానే ముఖంలో ఉత్సాహం కనిపిస్తుంది. పండగలు, జాతీయ పర్వదినాల వేళ లభించే సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా తమ చారిత్రక నేపథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, మతపరమైన విశ్వాసాల ఆధారంగా సెలవుల సంఖ్యను నిర్ణయిస్తుంది. అయితే ప్రపంచంలోనే అత్యధిక అధికారిక సెలవులు ఉన్న దేశం ఏదో తెలుసా? ఆశ్చర్యకరంగా ఆ ఘనత మన భారతదేశానికే దక్కింది.

జాతీయ పర్వదినాలు, గెజిటెడ్ సెలవులు, ఐచ్చిక సెలవులతోపాటు విభిన్న మతాలు, రాష్ట్రాల వారీగా ఉండే ప్రాంతీయ పండగలను పరిగణలోనికి తీసుకున్నట్లయితే భారతదేశంలో ఏడాదికి దాదాపు 42 సెలవుల వరకు ఉంటాయి. మనదేశంలోని సంస్కృతిక వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం వల్ల ఈ సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఇక పాఠశాలల పిల్లలకు సమ్మర్ హాలీడేస్ అదనంగా ఉంటాయి.

ఇక ఈ లిస్టులో భారత్ తర్వాత స్థానాల్లో ఆసియా దేశాలే ఎక్కువగా ఉన్నాయి. మన పొరుగు దేశం అయిన నేపాల్ ఏడాదికి సుమారు 35సెలవులతో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్కడ దశలైన్, తిహార్ వంటి పెద్ద పండగల సందర్భంగా వరుసగా సెలవులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇక ఇరాన్, మయన్మార్ దేశాలు చెరో 26 సెలవులతో ఉమ్మడిగా 3వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంక 25 అధికారిక సెలవులతో 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకలో బౌద్ధ, హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల ప్రధాన పండగలకు సమ ప్రాధాన్యం ఇస్తూ అక్కడ అధికారికంగా సెలవులను కేటాయిస్తారు.

కొన్ని అభివృద్ధి చెందిన.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా తక్కువ సెలవులు ఉంటాయి. ఉదాహరణకు.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రతి సంవత్సరం కేవలం 10 ప్రభుత్వ సెలవులు మాత్రమే ఉంటాయి. నెదర్లాండ్స్, సెర్బియా వంటి యూరోపియన్ దేశాలలో ఈ సంఖ్య తొమ్మిదికి పడిపోగా, మెక్సికోలో సంవత్సరానికి కేవలం ఎనిమిది సెలవులు మాత్రమే ఉన్నాయి. కేవలం ఆరు అధికారిక సెలవులతో వియత్నాం ఈ జాబితాలో అట్టడుగున ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పమని చెప్పవచ్చు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES