ప్రయాణం సులభతరం కావడానికి FASTag ఎంతగానో ఉపయోగపడుతుంది. టోల్ ప్లాజా వద్ద చిల్లర ఇబ్బందులు లేకుండా, ఇతర UPI పేమెంట్లలో సమస్యలు ఎదురుకాకుండా FASTag ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఫోర్ వీలర్స్ టోల్ ప్లాజా వద్ద టాక్స్ చెల్లించిన తర్వాతే ప్రయాణం చేయగలుగుతారు. అయితే, FASTag మీ ఖాతాకు మొబైల్ నెంబర్‌తో లింక్ అయి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా దానిని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం.
FASTag ఖాతాకు మొబైల్ నెంబర్ ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. అప్పుడే టోల్ పేమెంట్స్, బ్యాలెన్స్ అప్‌డేట్స్, రీఛార్జ్ రిమైండర్స్ వంటి వివరాలు SMS ద్వారా మీకు అందుతాయి. మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం వల్ల మోసపూరిత లావాదేవీలను కూడా నివారించవచ్చు. అందుకే నెంబర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి.
FASTag ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి?
ముందుగా FASTag అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, 'అప్‌డేట్ యువర్ ఇన్ఫర్మేషన్' విభాగంలో మీ కొత్త మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వచ్చే OTPని నమోదు చేసి 'సబ్మిట్' బటన్ క్లిక్ చేయాలి. దీనివల్ల ప్రక్రియ పూర్తవుతుంది మరియు మీ కొత్త మొబైల్ నెంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఆఫ్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలి?
మీరు మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం ద్వారా లేదా అధికారిక FASTag పాయింట్ల వద్ద కస్టమర్ సర్వీస్ డెస్క్‌లో కూడా మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. అక్కడ మీ కొత్త నెంబర్‌ను మరియు సరైన వివరాలను నమోదు చేయాలి. వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారులు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తే మార్పు పూర్తయినట్లు అర్థం.