ఆధార్ కార్డ్‌లో ఇంటి పేరు మార్పుపై ఊరట.. వివాహమైన మహిళలకు UIDAI కీలక నిబంధనలు!
ఆధార్ కార్డుపై పేరు తప్పుగా ఉందా? పెళ్లైన తర్వాత మీ ఇంటి పేరు మార్చుకోవాలా? అయితే, చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు మీ సర్ నేమ్ మార్చాలనుకుంటే ఇక కొత్త నియమాలను అనుసరించి ఆ పని పూర్తి చేయండి. యూఐడీఏఐ ప్రకారం ఇకపై పేరు మార్చాలంటే అఫిడవిట్ కూడా ఇవ్వాల్సిందే. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Aadhaar Name Correction: ఆధార్ కార్డు మన దేశంలో ఒక గుర్తింపు కార్డు. ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉండాల్సిందే. ప్రధానంగా ఈ ఆధార్ కార్డుతోనే ఏవైనా ప్రభుత్వ పథకాల లబ్దిని కూడా పొందుతారు. అంతేకాదు సిమ్ కార్డు కొనుగోలు నుంచి స్కూలు, కాలేజీ సీటు కొనుగోలు చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అయితే, యూఐడీఏఐ కొత్త నిబంధనల ప్రకారం మీ ఆధార్ కార్డులో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేట్ లేదా ఇంటి పేరు మార్చాలంటే అఫిడవిట్ కూడా ఇవ్వాల్సిందే. ప్రధానంగా మహిళలు పెళ్లి తర్వాత వారి ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
దీంతోపాటు ఒక్కోసారి మన పేరులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండవచ్చు. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ 2026 యూఐడీఏఐ ప్రకారం ఆధార్ కార్డులోని పేరు మార్పులు చేయాలంటే సంబంధిత డాక్యుమెంట్‌తోపాటు అఫిడవిట్ కూడా తప్పనిసరి చేశారు. యూఐడీఏఐ ఈ కొత్త SOP 2026 సెప్టెంబర్ 18వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం అఫిడవిట్ ఇతర డాక్యుమెంట్‌లను క్షుణ్నంగా యూఐడీఏఐ చెక్ చేస్తుంది.
చిన్నపాటి మార్పులకు..
అంటే అబ్రెవేషన్, ఇంటిపేరు లెట్టర్ తీసేయాలన్నా, యాడ్ చేయాలన్నా, ఆర్డర్ మార్చాలన్నా చిన్నపాటి స్పెల్లింగ్ మిస్టేక్స్, (.) తొలగించడం, క్యాపిటల్ లెట్టర్‌లోకి మార్చడం వంటివి గుర్తింపు మార్చడం కాదు..
అయితే, పెళ్లి తర్వాత సర్ నేమ్, ఇంటి పేరు మార్చాలంటే అఫిడవిట్ ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిందే. అయితే, అందులో క్షుణ్నంగా పెళ్లి తర్వాత పేరు మార్పు అని లేదా డివోర్స్ వల్ల మార్పు అని రాసి ఉండాలి.
Read Also: భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.6,000 పెన్షన్! పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన కొత్త రూల్స్ ఇవే..!
ఇప్పుడు పేరులోని చిన్నపాటి మిస్టేక్స్ అంటే డేటా ఎంట్రీ మార్పులకు కూడా అఫిడవిట్ ఇవ్వాల్సిందే. ఒక వేళ పూర్తిగా మీ పేరు మార్చాలనుకుంటే మేజర్ నేమ్ చేంజ్ పరిధిలోకి వస్తుంది. దీనికి ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ తప్పనిసరి. పూర్తి పేరు మార్పునకు గెజెట్ లేనిదే కుదరదు. యూఐడీఏఐ ఇప్పటికే ఆన్‌లైన్ నేమ్ కరెక్షన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. మీరు పేరు మార్చుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సిందే.
అక్కడ మీ నేమ్ అప్‌డేట్ ఫారమ్‌తోపాటు సంబంధిత డాక్యుమెంట్‌లను కూడా ఆపరేటర్‌కు ఇవ్వాలి. బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ సెంటర్ ఆపరేటర్ మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. దీంతో మీ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.