SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

BSNL సిమ్ వాడుతున్నారా? డేటా, మెయిన్ బ్యాలెన్స్, ప్లాన్ వ్యాలిడిటీ చెక్ చేసే సీక్రెట్ కోడ్స్ ఇవే!

మీరు BSNL మొబైల్ కస్టమర్ అయితే, మీ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఒక్కోసారి సర్వీస్ అనుకోకుండా ముగిసిపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, BSNL కనెక్షన్ ఉన్నవారు తమ వాలిడిటీ ఎన్ని రోజులు ఉంది? ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 27, 2026, 03:51 PM IST | Updated: Sep 27, 2026, 03:53 PM IST
Image Credit: BSNL Prepaid Validity Check
Join

BSNL Prepaid Validity Check: ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్‌లు తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, మీ ప్లాన్ వ్యాలిడిటీని ఎక్కడ చెక్ చేయాలి. ఎలా రీఛార్జ్ చేసుకోవాలో మీకు తెలుసా? ఈ స్టెప్ బై స్టెప్ ప్రక్రియ ద్వారా మీ రీఛార్జ్ వాలిడిటీ ఇంకా ఎన్ని రోజులు ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్లాన్ అకస్మాత్తుగా కట్ అయినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు.

USSD కోడ్ ద్వారా:
BSNL USSD కోడ్ ఆధారంగా కూడా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. మీ BSNL మొబైల్ నంబర్ నుండి *123# డయల్ చేయాలి. ఆపై కాల్ బటన్ నొక్కితే, మీ స్క్రీన్ పై మెయిన్ బ్యాలెన్స్ మరియు వాలిడిటీ పూర్తి వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఉన్న ఆప్షన్ల ద్వారా మీరు మరిన్ని వివరాలు పొందవచ్చు. ఒకవేళ మీకు డేటా బ్యాలెన్స్, ప్లాన్ వాలిడిటీ కావాలనుకుంటే, మీ BSNL నంబర్ నుండి *124# డయల్ చేసి కాల్ బటన్ నొక్కాలి. స్క్రీన్ పై కనిపించే ఆప్షన్ల ద్వారా మీ డేటా ప్లాన్ వివరాలను తెలుసుకోవచ్చు.
    
వాట్సాప్ ద్వారా:
BSNL ప్లాన్ వివరాలు వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. ముందుగా 1800-4444 అనే నంబర్‌ను మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్‌లో ఆ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపండి. వెంటనే మీకు ఆటోమేటిక్‌గా రెస్పాన్స్ వస్తుంది. అక్కడ మీ యాక్టివ్ ప్లాన్స్, బ్యాలెన్స్ మరియు వాలిడిటీ పూర్తి వివరాలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా:
మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి 'BSNL Selfcare App'ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ BSNL మొబైల్ నంబర్‌తో లాగిన్ అయినప్పుడు మీకు ఒక OTP వస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, డాష్‌బోర్డ్‌లో మీ యాక్టివ్ ప్లాన్ వాలిడిటీని చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ వద్ద ఉన్న బ్యాలెన్స్ వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి.

కస్టమర్ కేర్ ద్వారా:
ఒకవేళ మీరు BSNL కస్టమర్ కేర్‌తో నేరుగా మాట్లాడాలనుకుంటే, మీ రిజిస్టర్డ్ BSNL మొబైల్ నంబర్ నుండి 1503 కి డయల్ చేయవచ్చు. అలాగే 18001801503 నంబర్ కూడా అందుబాటులో ఉంది. అక్కడ సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ద్వారా మీ మొబైల్ నంబర్ బ్యాలెన్స్ ఇతర వ్యాలిడిటీ వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ విధంగా మీ రీఛార్జ్ ప్లాన్ వివరాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల, కనెక్షన్ సడన్‌గా కట్ అవ్వకుండా ముందస్తుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతుల ద్వారా మీరు సులభంగా వివరాలను తెలుసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES