ఆధార్ కార్డు అనేది మనం వివిధ రకాల పనుల కోసం ఉపయోగించే ఒక గుర్తింపు కార్డు. కాబట్టి బ్యాంకులో, సిమ్ కొనుగోలు చేసే చోట్ల దీనిని ఇవ్వాల్సి ఉంటుంది. హార్డ్ కాపీని జారీ చేసి అందజేస్తూ ఉంటాం. అయితే మొత్తం 12 అంకెలు కనిపించకుండా మాస్క్డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా?
ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో బయోమెట్రిక్ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్తగా స్కూల్ అడ్మిషన్ పొందాలన్నా ఇది అవసరం. ఇందులో 12 అంకెల సంఖ్య ఉంటుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. తద్వారా మీ ఆధార్ మోసగాళ్ల చేతికి చిక్కకుండా, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇందులో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఉంటాయి. మీ ఇంటి నుంచే ఫోన్ ద్వారా సులభంగా మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి?
మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే సాధారణ ఆధార్ కార్డే. అయితే ఇందులో మొదటి 8 అంకెలు కనిపించకుండా ఉంటాయి. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. తద్వారా మీ ఆధార్ సంఖ్య పూర్తిగా కనిపించకుండా ఉంటుంది. ఎక్కడైనా సమర్పించినా ఇబ్బంది ఉండదు.
మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం..
మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయాలంటే ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. అక్కడ మీ వివరాలతో లాగిన్ అవ్వండి. 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేయాలి. లాగిన్ అయ్యాక "ఆధార్ డౌన్లోడ్" సేవను ఎంచుకోండి. అక్కడ మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకుంటే 8 అంకెలు కనిపించకుండా దాచబడతాయి. తర్వాత డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఇది PDF రూపంలో వస్తుంది. దానిని మీ పరికరంలో సేవ్ చేసుకోవచ్చు. PDF ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం ఉంటుంది.