SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. మన దేశంలో ప్రతి ఒక్కరి వద్ద ఆధార్ కార్డు ఉంటుంది. ఇది ఒక గుర్తింపు కార్డు. దీని ద్వారా ప్రజలు ప్రజా ప్రయోజనాలు పొందుతారు. ప్రధానంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా, స్కూలు, కాలేజీల్లో అడ్మిషన్, సిమ్ కార్డు కొనుగోలు, బ్యాంకు ఖాతా ప్రారంభం వంటివి కూడా దీని ద్వారానే జరుగుతాయి. అయితే ఆధార్ కార్డును దుర్వినియోగం కాకుండా ఎలా కాపాడుకోవాలో, మాస్క్డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు తెలుసా?

Written By Renuka Godugu
Published: Oct 25, 2026, 07:19 PM IST | Updated: Oct 25, 2026, 07:24 PM IST
Image Credit: Masked Aadhaar Card Download Online 2026
Join

ఆధార్ కార్డు అనేది మనం వివిధ రకాల పనుల కోసం ఉపయోగించే ఒక గుర్తింపు కార్డు. కాబట్టి బ్యాంకులో, సిమ్ కొనుగోలు చేసే చోట్ల దీనిని ఇవ్వాల్సి ఉంటుంది. హార్డ్ కాపీని జారీ చేసి అందజేస్తూ ఉంటాం. అయితే మొత్తం 12 అంకెలు కనిపించకుండా మాస్క్డ్ ఆధార్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసా?

ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇందులో బయోమెట్రిక్ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్తగా స్కూల్ అడ్మిషన్ పొందాలన్నా ఇది అవసరం. ఇందులో 12 అంకెల సంఖ్య ఉంటుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. తద్వారా మీ ఆధార్ మోసగాళ్ల చేతికి చిక్కకుండా, దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడవచ్చు. ఇందులో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు నమోదు చేసి ఉంటాయి. మీ ఇంటి నుంచే ఫోన్ ద్వారా సులభంగా మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read ALso: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆధార్‌తో రేషన్ కార్డ్ లింక్ చేయకపోతే రేషన్ కట్? ఆన్‌లైన్‌లో ఇలా 2 నిమిషాల్లో పూర్తి చేయండి!
 

మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏమిటి?
మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే సాధారణ ఆధార్ కార్డే. అయితే ఇందులో మొదటి 8 అంకెలు కనిపించకుండా ఉంటాయి. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. తద్వారా మీ ఆధార్ సంఖ్య పూర్తిగా కనిపించకుండా ఉంటుంది. ఎక్కడైనా సమర్పించినా ఇబ్బంది ఉండదు.

మాస్క్డ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం..
మాస్క్డ్ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయాలంటే ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. అక్కడ మీ వివరాలతో లాగిన్ అవ్వండి. 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఆధార్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేయాలి. లాగిన్ అయ్యాక "ఆధార్ డౌన్లోడ్" సేవను ఎంచుకోండి. అక్కడ మాస్క్డ్ ఆధార్ ఆప్షన్ ఎంచుకుంటే 8 అంకెలు కనిపించకుండా దాచబడతాయి. తర్వాత డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఇది PDF రూపంలో వస్తుంది. దానిని మీ పరికరంలో సేవ్ చేసుకోవచ్చు. PDF ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరం ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES