• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తో నిమిషాల్లో పాన్-ఆధార్ లింక్.. స్టెప్-బై-స్టెప్ పూర్తి గైడ్ ఇదే!

మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తో నిమిషాల్లో పాన్-ఆధార్ లింక్.. స్టెప్-బై-స్టెప్ పూర్తి గైడ్ ఇదే!

ఆధార్‌కార్డు, పాన్‌కార్డు ప్రతి ఒక్కరికీ అవసరం. ఇది మన దేశంలో ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్స్‌.. బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలన్నా.. ట్యాక్స్‌ రిటర్న్స్‌, లోన్‌ అప్రూవల్‌ పొందాలన్నా ఈ ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 20, 2026, 11:52 IST|Updated: Nov 20, 2026, 11:56 IST
joinshare
మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తో నిమిషాల్లో పాన్-ఆధార్ లింక్.. స్టెప్-బై-స్టెప్ పూర్తి గైడ్ ఇదే!
Image Credit: How to Link PAN With Aadhaar:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to Link PAN With Aadhaar: ఆధార్‌ కార్డు మన దేశంలో ఎంతో ముఖ్యమైన పత్రం. అదేవిధంగా పాన్‌కార్డు కూడా ముఖ్యమే. అయితే, ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు కూడా మన దేశంలో ఎంతో ముఖ్యం. ఈ రెండిటినీ లింక్‌ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆధార్‌, పాన్‌కార్డు లింక్‌ అవ్వకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ప్రభుత్వం కేవైసీ కూడా తప్పనిసరి చేసింది. ఇప్పటికే మీరు ఆధార్‌, పాన్‌ కార్డు లింక్‌ చేస్తే ఓకే కానీ, లేదంటే లింక్‌ చేయండి. పాన్‌ కార్డు సీజ్‌ చేసే అవకాశం కూడా ఉంది. ఇంట్లోనే కూర్చొని కూడా సింపుల్‌గా ఆధార్‌, పాన్‌ కార్డు కూడా లింక్‌ చేయవచ్చు. సింపుల్‌ స్టెప్స్‌తో ఆ  పని పూర్తి చేయవచ్చు.

పాన్‌, ఆధార్‌ కార్డు లింక్‌ చేసే విధానం..
మొదట ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. అక్కడ లింక్‌ ఆధార్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆధార్‌, పాన్‌ కార్డు నెంబర్స్‌ నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 'I Agree valdate aadhaar details with UIDAI' సెలక్ట్‌ చేయండి. అప్పుడు పాన్‌ విజయవంతంగా లింక్‌ అయింది అనే మెసేజ్‌ వస్తుంది.

ఎస్‌ఎంఎస్‌ ద్వారా..
ఆధార్‌, పాన్‌ కార్డు ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా లింక్‌ చేయవచ్చు. దీనికి UIDPAN <12 అంకెల ఆధార్‌ నెంబర్‌> <10 డిజిట్‌ పాన్‌> మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి పంపించండి.
ఈ మెసేజ్‌ రిక్వెస్ట్‌ మీరు 567678 లేదా 56161 నెంబర్‌కు పంపించాలి.

ఇ పాన్‌ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవడం..
ఆదాయపు పన్ను శాఖ వారి ఇ ఫైలింగ్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయండి.
ఇక్కడ క్విక్‌ లింక్స్‌ కనిపిస్తాయి. ఎడమవైపు Instant ePAN ఆప్షన్‌ కనిపిస్తుంది. 
ఇక్కడ Get New ePAN బట్టన్‌ ప్రెస్‌ చేసి మీ ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయండి. ఇప్పుడు డిక్లరేషన్‌ బాకస్‌ కూడా చెక్‌ చేసి కంటిన్యూ ఎంపిక చేయండి.

6 డిజిట్‌ ఓటీపీ మీ మొబైల్‌ నెంబర్‌కు వస్తుంది. ఇది మీ డీజీ లాకర్‌కు రీడైరెక్ట్‌ అవుతుంది. మీ పుట్టిన తేదీ, కేవైసీ వివరాలతో వెరిఫై చేయండి.
మీ ఆధార్‌తో ఈమెయిల్‌ ఐడీ కూడా లింక్‌ అయ్యేలా చూడాలి. అప్పుడే వ్యాలిడేట్‌ చేయగలం. అప్పుడు మీ ఆధార్‌లో ఉండే పేరు, పుట్టిన తేదీ వివరాలు, ఫోటో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card
Telugu News