• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఆధార్ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లో నుంచే మొబైల్ నంబర్, అడ్రస్ నిమిషాల్లో మార్చుకోండిలా!

ఆధార్ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లో నుంచే మొబైల్ నంబర్, అడ్రస్ నిమిషాల్లో మార్చుకోండిలా!

ఆధార్‌ కార్డుపై ఏమైనా అప్‌డేట్‌ చేయాలా? ఆధార్‌ కేంద్రానికి వెళ్లకుండానే సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఆ పని పూర్తి చేయవచ్చు. స్టెప్‌ బై స్టెప్‌ ఆ ప్రక్రియ ఏంటి? తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 19, 2026, 10:01 IST|Updated: Nov 19, 2026, 10:05 IST
joinshare
ఆధార్ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లో నుంచే మొబైల్ నంబర్, అడ్రస్ నిమిషాల్లో మార్చుకోండిలా!
Image Credit: Mobile and address update:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mobile and address update: ఆధార్‌ కార్డుదారులు ఇది వరకు ఏమైనా అప్‌డేట్‌ చేయాలంటే ఆధార్‌ కేంద్రాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి ఉండేది. దీనికి వివిధ కారణాలు కావచ్చు. అయితే, ఆధార్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రధానంగా మన ఆధార్‌ కార్డుపై మొబైల్‌ నెంబర్‌, ఇంటి అడ్రస్‌ కూడా అప్‌డేటాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. ఇంట్లో నుంచే సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే ఏ పేపర్‌ వర్క్‌ లేకుండానే అప్‌డేట్‌ చేసుకోవచ్చు.  ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి అయితే, ఇది వరం వంటిది. ఆధార్‌ అప్‌డేట్‌ అంటే వారికి కష్టతరంగా ఉండేది. ఇప్పుడు ఆధార్‌ కార్డు ఇంట్లో నుంచి సింపుల్‌గా ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌ ఎలా మార్చుకోవాలి. తెలుసుకుందాం.

మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేసే విధానం..
సింపుల్‌గా ఇంట్లోనే ఆన్‌లైన్‌లో మీ మొబైల్‌లోనే ఆధార్‌ కార్డుపై ఉండే నెంబర్‌ మార్చుకోవచ్చు. దీనికి గూగుల్‌ ప్లే స్టోర  లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆధార్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
ఇప్పుడు యాప్‌ ఓపెన్‌ చేసి అప్‌డేట్‌ మొబైల్‌ నెంబర్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.
మీ కొత్త మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయండి.
ఆ తర్వాత ఓటీపీ మీ మొబైల్‌ నెంబర్‌కు వస్తుంది. దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫేస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను కూడా పూర్తి చేయండి. ఇప్పుడు మీ అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ కూడా సబ్మిట్‌ చేయండి.
యూఐడీఏఐ మీ రిక్వెస్ట్‌ వెరిఫై చేసే వరకు ఆగండి.
ఎప్పటికప్పుడు మీరు ఆన్‌లైన్‌లో స్టేటస్‌ కూడా చెక్‌ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 15 రోజుల సమయం పడుతుంది.

ఆన్‌లైన్‌లో అడ్రస్‌ అప్‌డేట్‌ చేసే విధానం..
ఆధార్‌ యాప్‌ మీ ఫోన్‌లో ఓపెన్‌ చేయండి.
ఆ తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వండి. MPIN, బయోమెట్రిక్స్‌ లేదా ముఖ గుర్తింపు ద్వారా అథెండికేట్‌ అవ్వండి.

ఇప్పుడు మీరు సర్వీసెస్‌ ఆప్షన్‌ క్లిక్ చేయాలి. అక్కడ అడ్రస్‌ అప్‌డేట్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అక్కడ ఫ్యామిలీ ఆధార్‌ ఆప్షన్‌. ఇప్పుడు సరైన ప్రూఫ్‌తో వెరిఫై కావాల్సి ఉంటుంది.
ఇప్పుడు న్యూ అడ్రస్‌ ఎంచుకొని మీ కొత్త ఇంటి అడ్రస్‌ను నమోదు చేయండి.
ఆ తర్వాత జాగ్రత్తగా రివ్యూ చేసి, సబ్మిట్‌ చేయండి. దీనికి రూ.75 నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు వెరిఫికేషన్‌ కోసం సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.
యూఐడీఏఐ ఆమోదం తర్వాత మీ ఆధార్‌ కార్డుపై అడ్రస్‌ అప్‌డేట్‌ అయిపోతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card
Telugu News