• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

పాన్‌కార్డు ఉందా? అందులో మీ ఫోటో పాతగా, బ్లర్‌గా కనిపిస్తోందా? దీంతో కేవైసీ ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. పాన్‌కార్డుపై కూడా ఫోటోను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 23, 2026, 15:29 IST|Updated: Nov 23, 2026, 15:33 IST
joinshare
పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!
Image Credit: How to change photo in PAN card online:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

2

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

3

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

4

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

5

Meenakshi Chaudhary Crush: "నా జీవితమే క్రష్ అయిపోయింది!" లవ్, బ్రేకప్‌పై మనసు విప్పిన హీరోయిన్ మీనాక్షి చౌదరి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

How to change photo in PAN card online: పాన్‌కార్డు మన దేశంలో ఆధార్‌కార్డు మాదిరి తప్పనిసరి. ఫైనాన్షియల్‌ లావాదేవీలు చేసే సమయంలో ఇది కీలకమైన డాక్యుమెంట్‌. ఇది ఒక వ్యక్తికి అధికారిక గుర్తింపు.  ప్రధానంగా బ్యాంకింగ్‌, ట్యాక్స్‌ సంబంధత పనులు, ఆర్థిక లావాదేవీలకు తప్పనిసరి చేశారు. ఈ పాన్‌కార్డుపై మన ఫోటో కూడా ఉంటుంది. ఒక వేళ ఈ ఫోటో అవుట్‌డేట్‌ అయినా, బ్లర్‌గా మారినా సరిగా కనిపించదు. అందుకే ఆన్‌లైన్‌లో వెంటనే మీరు పాన్‌కార్డుపై ఉన్న ఫోటో అప్‌డేట్‌ చేసుకోవాలి.

పాన్‌కార్డు ఫోటో అప్‌డేట్‌ చేసే విధానం...
ముందుగా NSDL లేదా UTIITSL అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి సంబంధిత వివరాలు నమోదు చేయాలి. అంటే PAN card Correction ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఫారమ్ (49A) క్లిక్ చేయండి. అక్కడ పాన్‌ నెంబర్‌, పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. అక్కడ photo mismatch ఎంపిక చేయాలి.

మీ ఇటీవలి ఫోటో (4.5cm*3.5cm) సైజులో ఉండాలి. ఆ తర్వాత దీన్ని జేపీఈజీ ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి. ఫైల్‌ సైజ్‌ 4కేబీ, 300 కేబీ స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.

సంబంధిత ధ్రువపత్రాలు అంటే ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  అన్ని వివరాలు సరిగ్గా అప్‌లోడ్‌ చేయాలి.

ఇండియా అడ్రస్‌ అయితే రూ.91 తోపాటు జీఎస్టీ చెల్లించాలి. ఓవర్‌సీస్‌ అయితే, రూ.862తోపాటు జీఎస్టీ నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు, యూపీఐ ద్వారా చెల్లించాలి.

పేమెంట్‌ పూర్తయిన తర్వాత మీకు 15 సంఖ్యల నెంబర్‌ జనరేట్‌ అవుతుంది. దాన్ని భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసి పెట్టండి.

ఒక్కోసారి NSDL లేదా UTIITSL కు ఫిజికల్‌ డాక్యుమెంట్స్‌ కూడా మెయిల్‌ చేయాల్సి రావచ్చు. అప్పుడు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో సైన్‌ చేసి పంపించాలి. ముఖంపై రాకుండా చేయాలి.

మీ పాన్‌కార్డు కరెంట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలి. మీ కన్‌ఫర్మేషన్‌ నెంబర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. పాన్‌ నెంబర్‌తో కూడా చెక్‌ చేసుకోవచ్చు.

ఫోటో మార్పునకు కావాల్సిన పత్రాలు..
మీ పాన్‌కార్డుపై ఉన్న ఫోటో మార్చాలంటే ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. పుట్టిన సర్టిఫికేట్‌, స్కూలు సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. అడ్రస్‌ ప్రూఫ్‌కు కరెంట్ బిల్‌, బ్యాంక్‌ స్టేట్మెంట్‌, ఒక ఆధార్‌ కార్డు కాపీ కూడా జత చేయాల్సి ఉంటుంది.

మీ ఫోటో ఇతర వివరాలు సరిగ్గా ఉండాలి. లేకపోతే రిజెక్ట్‌ అయ్యే అవకాశం ఉంది. మీ వివరాలు అంటే,  పేరు, అడ్రస్‌ ఇతర వివరాలు చెక్‌ చేసి పంపించండి. ఆమోదం అయిన వెంటనే అప్‌డేట్‌ అయిన పాన్‌కార్డు కేవలం 20 రోజుల్లోపు మీ అడ్రస్‌కు పంపిస్తారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Pan Card
Telugu News