• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

Director Sampath Nandi Apology: సాధారణంగా సినిమా ఈవెంట్స్‌లో హీరోయిన్లను సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటాము. కానీ సంపత్ నంది మాత్రం డింపుల్ హయతిని అందరి ముందు క్షమాపణలు చెప్పారు. అది కూడా ఒక పాట విషయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ సారీ చెప్పడం విశేషం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 15:02 IST|Updated: Nov 23, 2026, 15:04 IST
joinshare
డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..
Image Credit: Sampath Nandi (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

2

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

3

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

4

Meenakshi Chaudhary Crush: "నా జీవితమే క్రష్ అయిపోయింది!" లవ్, బ్రేకప్‌పై మనసు విప్పిన హీరోయిన్ మీనాక్షి చౌదరి!

5

Panchayat Elections: ఏపీలో మామ అల్లుళ్ల 'పంచాయితీ'.. బాలకృష్ణ వర్సెస్ నారా లోకేశ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhogi Pre Relase Event: సంపత్ నంది.. డింపుల్ హయతికి స్టేజ్ పై క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? హీరోయిన్‌కు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుందిశర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'భోగి'. నవంబర్ 22న హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఈ సినిమాలో డింపుల్ హయాతి 'మందారం' అనే కీలక పాత్రలో నటించింది. అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా కనిపించబోతుంది. అయితే ఈ సినిమా ఈవెంట్‌లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. హీరోయిన్ డింపుల్ హయాతికి తాను ఒక మాట ఇచ్చానని, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చారు.

స్కిన్ షో లేకుండా డింపుల్ హయాతి..

డింపుల్ హయాతిని ఒక పాటలో ఎలాంటి స్కిన్ షో లేకుండా, అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్ లేకుండా చాలా హుందాగా చూపిస్తానని సంపత్ నంది ముందుగానే హామీ ఇచ్చారట.అంతేకాదు.. అలనాటి దిగ్గజ దర్శకుడు రాజ్ కపూర్ సినిమాల్లో హీరోయిన్లను చూపించిన విధంగా.. గ్లామర్ కంటే అందం, అభినయం, కళ్లలోని భావాలకు ప్రాధాన్యతనిస్తూ ఒక అద్భుతమైన పాటను తెరకెక్కించాలని అనుకున్నారట.

కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాటను అనుకున్న విధంగా రూపొందించలేకపోయారట.దీంతో ట్రైలర్ లాంచ్ వేదికపైనే డింపుల్ హయాతికి సంపత్ నంది మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు.. భవిష్యత్తులో మరోసారి కలిసి పనిచేసినప్పుడు తాను ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

సంపత్ నంది తనలోని టాలెంట్‌ను గుర్తించారు..

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దర్శకుడు క్షమాపణలు చెప్పిన తర్వాత డింపుల్ హయాతి కూడా చాలా భావోద్వేగంగా స్పందించారు.ఇండస్ట్రీలో చాలామంది తనను గ్లామర్ కోణంలోనే చూశారని.. కానీ సంపత్ నంది మాత్రం తన శరీరాన్ని కాకుండా కళ్లలోని భావాలను, నటనను గుర్తించారని చెప్పారు.తనలోని నటిని గుర్తించి ఇంతటి బలమైన పాత్ర ఇచ్చినందుకు సంపత్ నందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆసక్తిరేకించిన సంభాషణ.. 
నిజానికి ఒక హీరోయిన్‌కు మంచి పాత్ర ఇవ్వడం ఒక ఎత్తయితే.. ఆమె వ్యక్తిత్వానికి, నటనకు గౌరవం ఇవ్వడం మరో ఎత్తు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు, హీరోయిన్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇక సినిమా విషయానికి వస్తే.. 'భోగి' ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇందులో శర్వానంద్ 'గంగ' అనే పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లపాటు కష్టపడ్డామని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. మొత్తానికి ఒక సినిమా ఈవెంట్‌లో దర్శకుడు చెప్పిన ఒక్క మాట ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. మరి 'భోగి' సినిమాతో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారు? డింపుల్ హయాతి తన కొత్త పాత్రతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అనేది చూడాలి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News