• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

Megastar Talk Show: చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే గుణం ఇవి మెగాస్టార్‌ను మిగతా హీరోల కంటే నెంబర్ వన్ ప్లేస్ కట్టబెట్టాయి. ఇప్పటి వరకు సినీ హీరోగా మాత్రమే పరిచయమైన చిరంజీవి.. ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి హోస్ట్‌గా మారి డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే చిరంజీవీస్ మెగావర్స్.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 15:04 IST|Updated: Nov 23, 2026, 15:09 IST
joinshare
మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..
Image Credit: Megaverse (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

పాన్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.. పాత, బ్లర్ ఫోటోతో KYC ఇబ్బందులా? మొబైల్‌లోనే 5 నిమిషాల్లో మార్చుకోండిలా!

2

మెగాస్టార్ కొత్త అవతారం.. ! మెగావర్స్ టాక్ షోకు క్యూ కడుతున్న స్టార్ హీరోలు..

3

డైరెక్టర్ క్షమాపణలు..! స్కిన్ షో వద్దన్న హీరోయిన్..! ఏమిటా కాంట్రవర్సీ..

4

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

5

Meenakshi Chaudhary Crush: "నా జీవితమే క్రష్ అయిపోయింది!" లవ్, బ్రేకప్‌పై మనసు విప్పిన హీరోయిన్ మీనాక్షి చౌదరి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Megaverse Talk Show: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఈ ప్రత్యేకమైన టాక్ షో ‘మెగావర్స్’ చేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్ర, సినీ ప్రముఖుల అనుభవాలు, తెరవెనుక ఆసక్తికరమైన సంఘటనలు.. ఇలా ఎన్నో విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు.ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇన్నాళ్లూ చిరంజీవిని హీరోగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఆయనను హోస్ట్‌గా చూడబోతున్నారు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంతో స్మాల్ స్క్రీన్ పై  సందడి చేసిన మెగాస్టార్.. ఇప్పుడు ఓటీటీ వేదికపై తన మాటలతో మ్యాజిక్ చేయబోతున్నారు.

ఫైనల్ కానీ గెస్ట్ లిస్ట్..

ఇక ఈ షోలో పాల్గొనే అతిథుల విషయంలో కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రజినీకాంత్ ,కమల్ హాసన్,  నాగార్జున, ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్  వంటి ప్రముఖ హీరోలు ఇప్పటికే ఈ షో కోసం షూటింగ్‌లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పూర్తి గెస్ట్ లిస్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు చిరంజీవితో నటించిన 80ల నాటి హీరోయిన్లందరితో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ టాక్‌ షోలో తనతో ఎక్కువ సినిమాల్లో నటించిన కథానాయికలతో చిరంజీవి మాటా ముచ్చట మరో లెవల్లో ఉండబోతున్నట్టు సమాచారం.

మరోవైపు నవంబర్ 30న హైదరాబాద్‌లో ఈ షోకు సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మొత్తానికి ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి.. ఇప్పుడు 'మెగావర్స్'తో మరోసారి హోస్టింగ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

మెగాస్టార్ ఆసక్తికర విషయాలు.. 

మరి ఈ మెగావర్స్‌లో మెగాస్టార్ ఎలాంటి ఆసక్తికరమైన విషయాలను బయటపెడతారు? తన సినీ ప్రయాణంలోని ఎలాంటి తెలియని కథలను అభిమానులతో పంచుకుంటారు? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇందులో కూర్చునే అతిథులతో తన అనుభవాలు.. వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లతో ఈ టాక్ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి. ఇప్పటికే ఈ టాక్‌ షోలో పలు ఎపిసోడ్స్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. అందులో బ్రహ్మీ, సునీల్, సత్య ఎపిసోడ్. రజినీ, కమల్,  నాగార్జున ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి ఫైనల్‌గా ఎవరి ఎపిసోడ్‌తో ఈ టాక్ స్టార్ అవుతుందో చూడాలి మరి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie