Husband allegedly cuts off her wife nose in uttar Pradesh: సమాజంలో ఇటీవల భార్యభర్తలకు చెందిన అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఒకర్ని మరోకరు హత్యలు చేసుకొవడమే కొంత మంది పనిగా పెట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు తమ భార్యలను చంపితే, మరికొన్ని చోట్ల భార్యలు తమ భర్తలను మట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని సీతాపూర్ జిల్లా, హర్‌గావ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్‌గావ్‌లో 21 ఏళ్ల క్రితం రాజేంద్ర అనే వ్యక్తితో నీలం అనే మహిళకు పెళ్లి అయ్యింది. వీరి కాపురం చాలా ఏళ్ల వరకు సజావుగానే సాగింది.
అయితే.. ఏడాది నుంచి ఆమె కపిల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇక జీవితాంతం కపిల్‌తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కోర్టులో పెళ్లి కూడా చేసుకొని.. కపిల్‌తో నీలం కొత్త జీవితం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆవేశంతో రగిలిపోయిన మాజీ భర్త రాజేంద్ర.. నీలం కోసం గాలింపు చర్యలు చేపట్టాడు.
చివరికి ఎక్కడుంటుందో తెలుసుకొని.. కొందరిని వెంటేసుకొని ఇంటికి వెళ్లాడు. అక్కడ కపిల్‌ను కొట్టాడు. అక్కడున్నవారిపై దాడి చేశాడు. భార్య నీలంను కింద పడేసి ఆమె ఛాతి మీద కూర్చొని.. కత్తి తీసుకొని ఆమె ముక్కుని నరికేశాడు. ఆతర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
వెంటనే స్థానికులు బాధిత మహిళను చికిత్స నిమిత్తం నీలం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.