SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: యూపీలో బైటపడ్డ మరో ఘోరం.. భార్య ఛాతిపై కూర్చుని ముక్కు నరికేసిన భర్త.. వీడియో..

Husband cuts wife nose in up: ఏడాది నుంచి ఆమె కపిల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితోనే ఉండాలని నిర్ణయించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 08:46 PM IST | Updated: Sep 29, 2026, 08:50 PM IST
Image Credit: Husbandcutswifenoseinupnews
Join

Husband allegedly cuts off her wife nose in uttar Pradesh: సమాజంలో ఇటీవల భార్యభర్తలకు చెందిన అనేక దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా ఒకర్ని మరోకరు హత్యలు చేసుకొవడమే కొంత మంది పనిగా పెట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు తమ భార్యలను చంపితే, మరికొన్ని చోట్ల భార్యలు తమ భర్తలను మట్టు పెడుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని సీతాపూర్ జిల్లా, హర్‌గావ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌ లోని సీతాపూర్ జిల్లా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హర్‌గావ్‌లో 21 ఏళ్ల క్రితం రాజేంద్ర అనే వ్యక్తితో నీలం అనే మహిళకు పెళ్లి అయ్యింది. వీరి కాపురం చాలా ఏళ్ల వరకు సజావుగానే సాగింది. 

అయితే.. ఏడాది నుంచి ఆమె కపిల్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇక జీవితాంతం కపిల్‌తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కోర్టులో పెళ్లి కూడా చేసుకొని.. కపిల్‌తో నీలం కొత్త జీవితం మొదలుపెట్టింది.  ఈ క్రమంలో ఆవేశంతో రగిలిపోయిన మాజీ భర్త రాజేంద్ర.. నీలం కోసం గాలింపు చర్యలు చేపట్టాడు.

చివరికి ఎక్కడుంటుందో తెలుసుకొని.. కొందరిని వెంటేసుకొని ఇంటికి వెళ్లాడు. అక్కడ కపిల్‌ను కొట్టాడు. అక్కడున్నవారిపై దాడి చేశాడు. భార్య నీలంను కింద పడేసి ఆమె ఛాతి మీద కూర్చొని.. కత్తి తీసుకొని ఆమె ముక్కుని నరికేశాడు. ఆతర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

 వెంటనే స్థానికులు బాధిత మహిళను చికిత్స నిమిత్తం నీలం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES