SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: ప్రియురాలితో కారులో భర్త సీక్రెట్ రొమాన్స్.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

Husband romance with lover in uttar Pradesh: మీరట్ లో భర్త తన ప్రియురాలితో కలిసి కారులో ఏకంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో అతగాడి భార్య వీరి యవ్వారంపై అనుమానంతో ఫాలో అయి రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరిని పట్టుకుంది. యూపీలోని మీరట్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 04, 2026, 03:17 PM IST | Updated: Oct 04, 2026, 03:22 PM IST
Image Credit: Woman climbs to car bonnet
Join

Husband caught red handed with girl friend in car meerut: సమాజంలో కొంత మంది భార్యభర్తలు పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయనిమచ్చగా మారుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండాల్సింది పోయి వివాహేతర సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వాళ్లను కాటికి పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు,  వైవాహితక జీవితంలో సమస్యల వల్ల కొంత మంది జీవిత భాగస్వామితో కాదని ఇతరులతో రొమాన్స్ కు దిగుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని మీరట్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

 

 ఉత్తర ప్రదేశ్ లో మీరట్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లోహినానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్-బ్లాక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో చోటు చేసుకున్న  ఈ ఘటన వార్తలలో నిలిచింది. పోలీసుల కథనం ప్రకారం, కిథోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్‌పూర్ కలా గ్రామానికి చెందిన మెంపాల్ సింగ్ కుమారుడు మయాంక్, మహివర్మ అనే మరో మహిళతో కలిసి స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తు రొమాన్స్ చేసుకుంటున్నాడు. 

 

అప్పటికే సునితా రావు తన భర్త కారును ఫాలో అవుతుంది. వెంటనే.. హాపుర్ రోడ్డుపై ఆ వాహనాన్ని ఆపి రచ్చ చేసింది. భార్య కేకలు పెడుతుందని మయాంక్ కోపంతో ఆమెపైకి కారును ఎక్కించేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె బానెట్ ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది.అలా ఒక వంద మీటర్ల వరకు కారుతో ఆమెను లాక్కెళ్లాడు. 

చివరకు రోడ్డుపైన ఇతరులు వాహనంను ఆపారు. దీంతో ఆ మహిళ తన భర్తను కారులోంచి బయటకు లాగి, నడిరోడ్డుపై అతని బట్టలు కూడా చించి నానా హంగామా చేసింది.  కాసేపు హైడ్రామా తర్వాత పోలీసులు  ఘటన ప్రదేశంకు చేరుకున్నారు. 

మయాంక్ తో పాటు, ఆమె ప్రియురాలిని అరెస్ట్ చేశారు.  మయాంక్ భార్య ఫిర్యాదు మేరకు వీరిపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు.  ఘటనలో ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES