• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

మనం ప్రతిరోజూ కష్టపడి సంపాదించిన డబ్బును కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ పెట్టుబడి పెడుతుంటాము. భద్రమైన పెట్టుబడి విషయానికి వస్తే, భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా చిన్న మొత్తాల్లో కూడా పొదుపు చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా సేవింగ్స్ చేస్తే అది పెద్ద మొత్తంగా మారుతుంది. మీరు ప్రతిరోజూ రూ.300 పొదుపు చేస్తే, సులభంగా రూ.6.42 లక్షలు తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 05:04 PM IST|Updated: Oct 04, 2026, 05:06 PM IST
joinshare
పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!
Image Credit: Post Office RD Scheme

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

2

Kollam Anju Case: అశ్లీల వెబ్‌సైట్‌లో శోభనం వీడియోలు..నవ వధువును ఘోరంగా టార్చర్ చేస్తున్న వరుడు!

3

ఆధార్, పాన్ కార్డ్‌లో అడ్రస్ మార్చాలా? నిమిషాల్లో ఇంట్లోనే ఇలా మార్చుకోండి!

4

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

5

New Job Card: 15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ప్రతిరోజు రూ.300 పక్కన పెడితే ఆరు పైన రూ.6.42 లక్షలు సులభంగా వస్తాయి. మనం రోజువారీ కష్టపడి పనిచేసేది పెట్టుబడి పెట్టడానికే, ఇది అత్యవసర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం బ్యాంకుల్లో FDలు చేస్తూ లేదా వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే, చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ పెద్ద మొత్తంలో రిటర్న్స్ పొందాలంటే పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో మీరు ప్రతిరోజు రూ.300 పక్కన పెడితే, నెలకు రూ.9,000 అవుతాయి. వీటిని ఐదేళ్లలో సులభంగా రూ.6.42 లక్షలుగా మార్చుకోవచ్చు. పెద్ద మొత్తంలో నగదును సృష్టించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన పథకం.

ఇది పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణ పనులకు కూడా ఉయోగించుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ ఈ పథకాన్ని ప్రధానంగా భద్రమైన పెట్టుబడి కోసం ప్రారంభించింది. ఒకేసారి పెట్టుబడి పెట్టేవారి కోసం ప్రత్యేకమైన స్కీమ్స్ ఉంటాయి. ఐదేళ్ల వరకు మన ఇష్టానుసారంగా ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుని పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మంచి రిటర్న్స్ కూడా పొందుతారు.

కాలిక్యూలేషన్స్‌..
పోస్ట్ ఆఫీస్‌లో మీరు ప్రతిరోజు రూ.300 చేస్తే నెలకు రూ.9,000 అవుతాయి. వీటిని 5 ఏళ్లలో సులభంగా మంచి కార్పస్ క్రియేట్ చేయవచ్చు. దీనిపై రూ. 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ అసలు మొత్తం రూ.5.40 లక్షలు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ దీనికి వడ్డీ సుమారు రూ.1.02 లక్షల అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. దీనివల్ల ఐదేళ్లలో మీరు మొత్తం రూ.6.42 లక్షలు పొందవచ్చు. మెచ్యూరిటీ సమయానికి మీకు ఒక పెద్ద మొత్తం అందుతుంది.

Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 
 

పోస్ట్ ఆఫీస్‌లో వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. RD స్కీమ్‌లో మీరు కేవలం రూ.100తో కూడా ప్రారంభించవచ్చు. ఆ తర్వాత పెట్టుబడిని పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ ఉంటే పెద్ద మొత్తంలో నిధిని సృష్టించుకోవచ్చు. ప్రతిరోజూ రూ.300 పక్కన పెడితే ఐదేళ్లలో లక్షల్లో కార్పస్ క్రియేట్ చేయవచ్చు. ఇందులో మీకు భద్రమైన రిటర్న్స్‌తో పాటు కళ్లు చెదిరే లాభాలు కూడా అందుతాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes